Bandla Ganesh : బండ్ల గణేష్ ఒకప్పుడు కమెడీయన్‌గా ప్రేక్షకులకి పలకరించగా, ఆ తర్వాత నిర్మాత అవతారం ఎత్తాడు. గబ్బర్ సింగ్‌తో లైమ్ లైట్ లోకి వచ్చాడు. ఆ మధ్య రాజకీయాలలోకి వెళ్లి చేతులు కాల్చుకున్న బండ్ల ఇటీవల కాంట్రవర్షియల్ కామెంట్స్ తో వార్తలలో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన బండ్ల గణేష్.. ఆ సభలో మాట్లాడిన మాటలు అందరినీ ఒక్కసారిగా అయోమయానికి గురి చేశాయి. ఏంటి పూరి జగన్నాథ్ తన కొడకుని కూడా వదిలేశాడా? ఫ్యామిలీని పట్టించుకోవడం లేదా? భార్య లావణ్యతో ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాడా? అనే అర్థాలు వచ్చేలా? బండ్ల గణేష్ స్పీచ్ సాగింది.
లావణ్యను పొగిడిన తీరు, కొడుకు ఈవెంట్‌కు కూడా రాకుండా ఏం బిజీగా ఉన్నావ్ అంటూ పూరిని నిలదీసిన తీరు చూస్తుంటే బండ్ల గణేష్ మరీ ఎక్కువగా పర్సనల్ విషయాలను టచ్ చేసినట్టు అనిపిస్తుంది. సక్సెస్ అయ్యాక ఎన్నో రాంప్ లు, వాంప్ లు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. సొంత కొడుకు సినిమా ఫంక్షన్‌కు రాకపోతే ఎట్లా.. మనం ఏం సంపాదించినా వారి కోసమే.. ఓ సామెత ఉంటుంది. దేశమంతా కళ్ళాపు జల్లాడు కానీ ఇంటి ముందు కళ్ళాపు జల్లడానికి టైం లేదు అంటూ పూరిపై బాగానే ఎక్కేశాడు.
పాడ్ కాస్ట్ రూపంలో పూరీ జగన్నాథ్.. బండ్లకి గట్టి షాక్ ఇచ్చాడని అంటున్నారు. తాజాగా బండ్లకు సరిపడే ఓ పాడ్ కాస్ట్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు పూరీ.. టంగ్ పేరుతో విడుదలైన ఈ వీడియో బండ్ల గణేష్ గురించేనని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. ఇక ఈ సందర్భంగా పూరీ ఆ వీడియోలో.. నాలుకను అదుపులో ఉంచుకోవాలని, ఎందుకంటే ఒకరి జీవితం మరియు మరణం నాలుకపై ఆధారపడి ఉంటుందని, చౌకబారుగా మాట్లాడవద్దని, ప్రవర్తించవద్దని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.