Pushpa : బాహుబలి సాయం కోరిన పుష్ఫరాజ్.. అభయమిచ్చిన డార్లింగ్.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa : బాహుబలి సాయం కోరిన పుష్ఫరాజ్.. అభయమిచ్చిన డార్లింగ్..

 Authored By mallesh | The Telugu News | Updated on :30 November 2021,6:14 pm

Pushpa : చిత్ర పరిశ్రమలో హీరోల మధ్య పోటీ కేవలం సినిమాల్లో మాత్రమే ఉంటుంది. కానీ, వ్యక్తిగతంగా వారంతా కలిసే ఉంటారు. అన్న, తమ్ముడు, బాబాయ్, మామ అని పిలుచుకుంటారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్తుంటారు. సినిమా ఆడియో ఫంక్షన్లకు అథితులుగా వస్తుంటారు. వారి సినిమాల కోసం ప్రమోషన్స్ సైతం చేస్తుంటారు. ఈ రకమైన ఫ్రెండ్లీ నేచర్ ఈ మధ్యకాలంలో బాగా కనిపిస్తోంది. మొన్న ‘అఖండ’ సినిమా ప్రమోషన్స్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనిపించిన విషయం తెలిసిందే. నందమూరి అభిమానులకు ఎంతో హుషారు తెప్పించారు. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ వంతు వచ్చింది. ఆయన సినిమాకు బాహుబలి ప్రభాస్ సాయం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ మూవీ త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో బన్నీకి జోడిగా హీరోయిన్ రష్మిక నటిస్తున్న విషయం తెలింసిందే. ఫస్ట్ టైం బన్నీ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్ధం అవుతుండగా.. అందుకు సంబంధించి మూవీ యూనిట్ భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. డిసెంబర్‌ 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు సమాచారం. విడుదల తేదీ దగ్గర పడుతుండగా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది చిత్ర బృందం.. ఈ క్రమంలోనే పుష్పకు సంబంధించి టీజర్‌, పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ అంచనాలు పెంచేశారు మూవీ మేకర్స్. అందుకోసమే డిసెంబర్‌ 12న హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేశారట..

pushfaraj seeks the help of bahubali

pushfaraj seeks the help of bahubali

Pushpa : బాలీవుడ్ మార్కెట్ కోసం ‘పుష్ప’కు బాహుబలి సాయం..

ఈ ఫంక్షన్‌కు బాహుబలి మూవీతో పాన్ ఇండియా రేంజ్‌ను సొంతం చేసుకున్న హీరో ప్రభాస్ రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూవీ యూనిట్ ప్రభాస్ ను కోరగా డార్లింగ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభాస్ నిజంగా వస్తే పాన్ ఇండియా రేంజ్ హీరోతో ప్రమోషన్ చేయిస్తే తప్పుకుండా పుష్పకు మార్కెట్ పెరుగుతుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.. ఆఫ్ స్క్రీన్‌లో బన్నీ, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్. దీంతో ప్రభాస్ కూడా బన్నీకి సాయం చేసేందుకు సిద్ధం అయ్యినట్టు తెలుస్తోంది.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది