Pushpa 2 1st Collection : ఇది పుష్పగాడి రేంజ్ అంటే.. తొలి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేశాడంటే..!
pushpa 2 1st Collection : ప్రేక్షకులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున పుష్ప 2 సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. ష్ప 2′ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయం సాధించింది. పుష్ప 1 కు మించి ఈ సినిమా ఉండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పుష్ప 2 ఘనవిజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పుష్ప 2 తొలిరోజే భారీగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ప్రీ సేల్ బుకింగ్స్ నుంచే భారీ స్పందన సాధించి, విడుదలైన మొదటి రోజే అద్భుతమైన వసూళ్లు నమోదు చేసింది.డిసెంబర్ 4 రాత్రి నుంచి థియేటర్లలో సందడి మొదలైన ఈ చిత్రం, కలెక్షన్ల పరంగా ఓవర్సీస్ మార్కెట్‌లోనూ టాప్ స్థానంలో నిలిచింది.
Pushpa 2 1st Collection : ఇది పుష్పగాడి రేంజ్ అంటే.. తొలి రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేశాడంటే..!
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజే రూ.175 కోట్ల వసూళ్లు సాధించింది. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు అత్యధికంగా ఉన్నట్లు సమాచారం.అమెరికాలో మాత్రమే తొలిరోజు ఈ చిత్రం దాదాపు 4.2 మిలియన్ డాలర్లు (రూ.35 కోట్ల పైగా) వసూలు చేయగా, ఈ విషయాన్ని నిర్మాతలు పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.’పుష్ప 2′ అమెరికాలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన మూడవ భారతీయ చిత్రంగా నిలిచింది. ఇక బుక్ మై షోలో ప్రీ సేల్ బుకింగ్స్ సమయంలోనే సినిమా భారీ దూకుడు చూపింది.డిసెంబర్ 4న చాలా చోట్ల సినిమా ప్రీమియర్ షోలు వేశారు. ప్రీమియర్ షోల ద్వారా సినిమాకు రూ. 10 కోట్లు రాబట్టింది. డిసెంబర్ 5న ఈ సినిమా ఇండియాలో రూ.165 కోట్లు వసూలు చేసింది. దీని ద్వారా సినిమా మొత్తం వసూళ్లు రూ. 175 కోట్లు వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ లెక్కలు కలుపుకుంటే పుష్ప సినిమా కలెక్షన్ దాదాపు రూ. 250 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది
ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియాలో తొలి రోజు రూ. 133 కోట్లు వసూల్ చేసింది. అలాగే బాహుబలి రూ. 121కోట్లు, కేజీఎఫ్ రూ. 116 కోట్లు వసూల్ చేశాయి. ఈ రికార్డ్స్ ను ఇప్పుడు పుష్ప బీట్ చేసింది. పుష్ప2 సినిమాను హైదరాబాద్‌లో 1549 షోలు వేశారు. కర్ణాటకలో దాదాపు 1072 షోలు , చెన్నైలో ఈ చిత్రానికి 244 షోలు వేశారు. కాగా తొలి రోజు వసూళ్లు రూ.175 కోట్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ.95.1 కోట్లు, హిందీ నుంచి రూ.67 కోట్లు, తమిళం నుంచి రూ.7 కోట్లు, మలయాళం నుంచి రూ.5 కోట్లు, కన్నడ వెర్షన్ నుంచి రూ.1 కోట్లు రాబట్టిందని తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.