Pushpa 2 : బాలీవుడ్ ఖాన్ ల గుండెల్లో గుబులు రేపిన పుష్ప రాజ్.. షేక్ ఆడించాడుగా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 2 : బాలీవుడ్ ఖాన్ ల గుండెల్లో గుబులు రేపిన పుష్ప రాజ్.. షేక్ ఆడించాడుగా..?

 Authored By ramu | The Telugu News | Updated on :6 December 2024,9:05 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 2 : బాలీవుడ్ ఖాన్ ల గుండెల్లో గుబులు రేపిన పుష్ప రాజ్.. షేక్ ఆడించాడుగా..?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ హంగామా ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమా బాలీవుడ్ ఖాన్ లను సైతం వెనక్కి నెట్టి తన పేరు మీద రికార్డులు సృష్టించాడు. పుష్ప రాజ్ పాత్రలో మొదటి సినిమాతోనే వారెవా అనిపించేసిన అల్లు అర్జున్ పుష్ప 2 తో పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. పుష్ప 2 పై వచ్చిన బజ్ కి సినిమా చేస్తున్న వసూళ్ల రచ్చ తోడైంది. పుష్ప 2 సినిమా ఫస్ట్ డే 294 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిందీలో 72 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్స్ రాబట్టింది. బాలీవుడ్ ఖాన్ లు సైతం ఈ వసూళ్లను చూసి షాక్ అవుతున్నారు. పుష్ప 2 ప్రీ రిలీజ్ బజ్ కి సినిమా కూడా ఆ రేంజ్ ఉండటం వల్ల వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇన్నేళ్ల భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఏ సినిమా కూడా కనీసం ఊహించలేని రికార్డులను పుష్ప 2 సాధించింది.

Pushpa 2 బాలీవుడ్ ఖాన్ ల గుండెల్లో గుబులు రేపిన పుష్ప రాజ్ షేక్ ఆడించాడుగా

Pushpa 2 : బాలీవుడ్ ఖాన్ ల గుండెల్లో గుబులు రేపిన పుష్ప రాజ్.. షేక్ ఆడించాడుగా..?

Pushpa 2 అసలు సిసలు పాన్ ఇండియా హిట్..

అంతకుముందు 1000 కోట్లు, 2000 కోట్లు వసూళ్లు రాబట్టిన సినిమాలు కూడా ఈ రేంజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టలేదు. బాలీవుడ్ లో పుష్ప 2 కలెక్షన్స్ చూసి అక్కడ హీరోలంతా కూడా షాక్ అయ్యి ఉంటారు. అసలు సిసలు పాన్ ఇండియా హిట్ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించింది. తప్పకుండా పుష్ప 2 నెవర్ బిఫోర్ రికార్డులతో రచ్చ రచ్చ చేస్తుంది.

సినిమా అంతా ఊర మాస్ కంటెంట్ తో మాస్ ఆడియన్స్ కు ఫుల్ ఫీస్ట్ అందిస్తుంది. మొదటి రోజే 300 కోట్ల మార్క్ కి దగ్గర టచ్ చేసిన పుష్ప 2 వీకెండ్ తోనే 500, 600 కోట్లు క్రాస్ చేసేలా ఉన్నాడు. పుష్ప 2 తో అల్లు అర్జున్ రియల్ పాన్ ఇండియా హీరోగా తన బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ చేశాడు. మరి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. Pushpa 2 Collections Bollywood Khans

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది