Pushpa 2 : పుష్ప 2కి అక్కడ భారీ దెబ్బ.. మల్లు స్టార్ కి ఇలా జరిగింది ఏంటి..?
ప్రధానాంశాలు:
Pushpa 2 : పుష్ప 2కి అక్కడ భారీ దెబ్బ.. మల్లు స్టార్ కి ఇలా జరిగింది ఏంటి..?
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళలో భారీ ఫాలోయింగ్ ఉంది. అతను చేసే సినిమాలు అక్కడ సూపర్ హిట్ కలెక్షన్స్ రాబట్టాయి. పుష్ప 1 సినిమా కూడా అక్కడ అదరగొట్టేసింది. ఐతే పుష్ప 2 సినిమా కోసం ఏకంగా సినిమాలో ఒక సాంగ్ లిరిక్ లో అన్ని భాషల్లో మళయాళంలో ఉంచారు. పుష్ప 2 సినిమా కేరళలో మొదటి రోజు 6 కోట్ల దాకా వసూళ్లు రాబెట్టింది. అన్ని చోట్ల కన్నా అది తక్కువే అయినా కేరళ లో స్ట్రైట్ హీరో సినిమా వసూళ్లులాగా చేస్తుంది.
ఐతే పుష్ప 2 సినిమా రెండో రోజు కలెక్షన్స్ 50 శాతం డ్రాప్ అయ్యాయి. ఇది పుష్ప మేకర్స్ కు షాక్ ఇచ్చింది. పుష్ప 2 సినిమా కేరళలో అక్కడ జనాలకు ఎక్కకపోవడంపై కారణాలు ఏంటన్నది చూస్తే.. అక్కడ జనాలకు ఈ రేంజ్ మాస్ సినిమాలు ఎక్కవు. మళయాల ఆడియన్స్ అంతా కూడా ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుంటారు. వారికి కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇష్టం. కానీ ఇలా ఊర మాస్ సినిమాలకు తక్కువ ఆదరణ ఉంటుంది.
Pushpa 2 మాస్ అంశాలు ఎక్కువ..
పుష్ప 2 సినిమాలో కాస్త మాస్ అంశాలు ఎక్కువ ఉన్నాయి. దాని వల్లే మళయాళ ఆడియన్స్ కు ఈ సినిమా అంతగా ఎక్కలేదు. అంతేకాదు సినిమాలో అక్కడ స్టార్ ఫాహద్ ఫాజిల్ నటించినా అతన్ను ఒక కమెడియన్ గా చూపించారు. అది కూడా సినిమా అక్కడ రిజల్ట్ కి రీజన్ అనేస్తున్నారు. ఫాహద్ ఫాజిల్ కు అక్కడ స్టార్ రేంజ్ ఉండగా అతన్ని పుషప్ 2 లో చాలా కామెడీగా చూపించారు.
ఈ కారణాల వల్ల పుష్ప 2 సినిమా మలయాళంలో సరైన వసూళ్లు రాబట్టలేకపోతుందని అంటున్నారు. ఐతే పుష్ప 1 మళయాళంలో సూపర్ హిట్ కాగా పుష్ప 2 కూడా అదే రేంజ్ వసూళ్లను రాబడుతుందని అనుకున్నారు. కానీ మొదటి రోజు కన్నా రెండో రోజు కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి. ఏది ఏమైనా పుష్ప 2 కి అక్కడ మాత్రం ఊహించని దెబ్బ తగిఏలా ఉంది. కేరళలో ఈ సినిమాను ఈ4 ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేశారు. Pushpa 2 Kerala Shock Allu Arjun Sukumar ,