
Pushpa 2 movie
Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో పుష్ప 2 పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది. పుష్ప మొదటి భాగానికి మించి పుష్ప 2 సినిమాను గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సీ ని కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొలిపింది.
Pushpa 2 movie is a few crores
ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ గంగమ్మ జాతర నేపథ్యంలో కాళికాదేవి గెటప్ లో కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఈ గెటప్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని స్టార్ట్ చేసేసారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి గ్లోబల్ మ్యూజిక్ రైట్స్ ని టి సిరీస్ భూషణ్ కుమార్ సొంతం చేసుకున్నారు. వీటితోపాటు హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ని కూడా భూషణ్ కుమార్ దక్కించుకున్నారని తెలుస్తోంది. మ్యూజిక్ హిందీ సాటిలైట్ రైట్స్ కోసం ఏకంగా 60 కోట్ల వరకు చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నారంట.
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మ్యూజిక్ రైట్స్ కోసం జరిగిన అతిపెద్ద డీల్ ఇదే అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. పుష్ప పాటలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ పాటలు గ్లోబల్ లో హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకోవడంతోపాటు టాప్ టెన్ ట్రెండింగ్ సాంగ్స్ లో పుష్ప పాటలు నిలిచాయి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో పుష్ప సిగ్నేచర్ స్టెప్ పాపులర్ అయింది. దీంతో దేవిశ్రీప్రసాద్ పుష్ప 2 కి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడంట. ఈ క్రమంలో టి సిరీస్ భూషణ్ కుమార్ గ్లోబల్ మ్యూజిక్ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్ కే సొంతం చేసుకున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.