Pushpa 2 : పుష్ప 2 కి అన్ని కోట్లా .. కనీ వినీ ఎరుగని బ్రేకింగ్ న్యూస్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pushpa 2 : పుష్ప 2 కి అన్ని కోట్లా .. కనీ వినీ ఎరుగని బ్రేకింగ్ న్యూస్..!!

Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో పుష్ప 2 పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది. పుష్ప మొదటి భాగానికి మించి పుష్ప 2 సినిమాను గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :12 May 2023,11:00 am

Pushpa 2 : సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. దీంతో పుష్ప 2 పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తుంది. పుష్ప మొదటి భాగానికి మించి పుష్ప 2 సినిమాను గ్రాండియర్ గా సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్సీ ని కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలను నెలకొలిపింది.

Pushpa 2 movie is a few crores

Pushpa 2 movie is a few crores

ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ గంగమ్మ జాతర నేపథ్యంలో కాళికాదేవి గెటప్ లో కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో భాగంగా ఈ గెటప్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ని స్టార్ట్ చేసేసారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి గ్లోబల్ మ్యూజిక్ రైట్స్ ని టి సిరీస్ భూషణ్ కుమార్ సొంతం చేసుకున్నారు. వీటితోపాటు హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ని కూడా భూషణ్ కుమార్ దక్కించుకున్నారని తెలుస్తోంది. మ్యూజిక్ హిందీ సాటిలైట్ రైట్స్ కోసం ఏకంగా 60 కోట్ల వరకు చెల్లించడానికి ఒప్పందం చేసుకున్నారంట.

Pushpa 2: The Rule Special Video Out! Allu Arjun Returns With Double The  Madness & Wildness As He Gives A Glimpse Into The World Of 'Pushparaj' On  His Birthday Eve - Watch

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మ్యూజిక్ రైట్స్ కోసం జరిగిన అతిపెద్ద డీల్ ఇదే అనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. పుష్ప పాటలు ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమాలోని పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ పాటలు గ్లోబల్ లో హైయెస్ట్ వ్యూస్ సొంతం చేసుకోవడంతోపాటు టాప్ టెన్ ట్రెండింగ్ సాంగ్స్ లో పుష్ప పాటలు నిలిచాయి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో పుష్ప సిగ్నేచర్ స్టెప్ పాపులర్ అయింది. దీంతో దేవిశ్రీప్రసాద్ పుష్ప 2 కి బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడంట. ఈ క్రమంలో టి సిరీస్ భూషణ్ కుమార్ గ్లోబల్ మ్యూజిక్ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్ కే సొంతం చేసుకున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది