Bigg Boss Geetu Royal : నాగార్జున కి ఝలక్ ఇస్తూ బిగ్ బాస్ లోంచి బయటకి రాగానే గీతూ రాయల్ కి పుష్ప 2 ఆఫర్ !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 12 November 2022, 5:40 pm

Bigg Boss Geetu Royal : ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో గీతూ రాయల్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించింది. తన గేమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తన గేమ్ చూసి గీతూ రాయల్ కచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశం ఉంటుందని చాలా మంది అనుకున్నారు.కానీ ఎవరు ఊహించని విధంగా తొమ్మిదో వారం జరిగిన ఎలిమినేషన్ రౌండ్ లో గీతూ ఎలిమినేట్ అయింది.

టాప్ 5 కంటెస్టెంట్ లో ఉండే గీతూ ఎలిమినేట్ అవ్వడం తో ఒక్కసారి గా హౌస్ లో గొడవలు మొదలైనాయి. అయితే ముందుగా ఇంస్టాగ్రామ్, టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన గీతూ తర్వాత జబర్దస్త్ లోకి అడుగుపెట్టి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇక ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది గీతూ. ఊహించిన విధంగా ఎలిమినేట్ అయిన గీతూ చాలా బాధపడుతూ బిగ్ బాస్ ను వీడింది. అయితే బిగ్ బాస్ లోపలికి వెళ్లడం వరకు ఓకే కాని బయటికి రావడానికి వేరే కారణం ఉందట.

Pushpa 2 offer to Geetu Royal after coming out of Bigg Boss

Pushpa 2 offer to Geetu Royal after coming out of Bigg Boss

అది ఏంటంటే గీతు జబర్దస్త్ లో పుష్ప స్కిట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ స్కిట్ తో గీతూ కి లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఇప్పుడు బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే పుష్ప 2 లో ఛాన్స్ కొట్టేసిందట ఈ ముద్దుగుమ్మ . అయితే జబర్దస్త్ లో చేసిన పుష్ప స్కిట్ వలనే గీతూ కు ఈ అవకాశం వచ్చిందని సమాచారం. అలాగే గీతూ మాట్లాడే యాస, ఆమె టాలెంట్ ను చూసి ఆమెకు పుష్ప 2 చిత్ర బృందం అవకాశం ఇచ్చిందని తెలుస్తోంది. అందుకే తాను బిగ్ బాస్ ను వీడి వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తు

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp