Bigg Boss Geetu : నాగార్జునను కలిసిన తర్వాత గీతూ అంత పని చేసిందా? వాళ్ల అమ్మకు తెలిస్తే చెప్పుతో కొడుతుందట
Bigg Boss Geetu : గీతూ రాయల్.. బిగ్ బాస్ కంటే ముందు తను ఒక సోషల్ మీడియా సెలబ్రిటీ. ఆ తర్వాత తను జబర్దస్త్ లోకి వెళ్లి ఇంకా ఫేమ్ సంపాదించుకుంది. తన ఫేమ్ ను చూసి బిగ్ బాస్ యాజమాన్యం.. బిగ్ బాస్ 6 లోకి అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ 6 లోకి వచ్చిన తర్వాత అసలు గీతూ క్యారెక్టర్ బయటపడింది. తను బయట ఎలా ఉండేదో.. బిగ్ బాస్ హౌస్ లోనూ అలాగే ఉండటం, అలాగే ప్రవర్తించడం చేసింది. కాకపోతే బిగ్ బాస్ హౌస్ కు ఏదో చేయాలని వచ్చింది గీతూ. తనేంటో నిరూపించుకోవాలని అనుకుంది. కానీ.. తనను 9 వ వారమే ఎలిమినేట్ చేసేశారు.
బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టగానే తన ఆటను మొదలుపెట్టిన గీతూ.. ముక్కుసూటిగా మాట్లాడుతూ ఏమాత్రం భయం లేకుండా ముందడుగేసింది. మొదట్లో తను ప్రతి నామినేషన్ లో ఉండేది. ప్రతి నామినేషన్ లో ఉన్న ఏమాత్రం భయపడకపోయేది. చివరకు తనను చాలా వారాల పాటు తన అభిమానులు సేవ్ చేస్తూ వచ్చారు. గీతూ ఎలిమినేషన్ ఎపిసోడ్ చాలా బజ్ క్రియేట్ చేసింది. తనను ఎలిమినేట్ చేయడంతో గీతూతో పాటు ఇతర కంటెస్టెంట్లు కూడా షాక్ అయ్యారు. ఏదో చేయాలని బిగ్ బాస్ కు వచ్చా కానీ.. ఇలా మధ్యలో వెళ్లిపోతా అని అనుకోలేదు అంటూ వేదిక మీదనే గీతూ కన్నీటి పర్యంతం అయిన విషయం తెలిసిందే. అయితే..
Bigg Boss Geetu : ఓ గాయాన్ని దాచుకునేందుకు చిరుత మచ్చలను టాటూగా వేయించుకున్న గీత
గీతూ బిగ్ బాస్ హౌస్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత చాలా బాధపడిందని, డిప్రెషన్ లో ఉందని తెలుసుకున్న హోస్ట్ నాగార్జున తనను ఇంటికి పిలిచాడట. తనతో కాసేపు మాట్లాడాడట. తాజాగా గీతూ విడుదల చేసిన తాజా వీడియోలో అవన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చినప్పుడు కూడా గీతూ చాలా ఏడ్చిందట. తను హౌస్ లో ఉండి ఉంటే.. ఫ్యామిలీ ఎపిసోడ్ కు తన అమ్మ కూడా వచ్చేది కదా అని బాధపడిందట. అలాగే తన కాలిపై ఉన్న కొన్ని గాయాలను కవర్ చేసుకునేందుకు చిరుత మచ్చల టాటూను వేయించుకుందట గీతూ. ఒక గాయాన్ని కవర్ చేసుకోవడం కోసమే దాన్ని వేసుకున్నా కానీ.. అమ్మకు ఈ విషయం తెలిస్తే మాత్రం తనను చెప్పుతో కొడుతుందని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది గీతూ.