Bigg Boss Geetu Royal : మోసపోయా అంటూ లైవ్ లోనే ఏడ్చేసిన బిగ్ బాస్ గీతా రాయల్… వీడియో వైరల్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Geetu Royal : మోసపోయా అంటూ లైవ్ లోనే ఏడ్చేసిన బిగ్ బాస్ గీతా రాయల్… వీడియో వైరల్…!

 Authored By prabhas | The Telugu News | Updated on :11 November 2022,3:40 pm

Bigg Boss Geetu Royal : ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 లో చెప్పుకోదగ్గ కంటెస్టెంట్లు ఎవరూ లేరనే చెప్పాలి. ఉన్నవాళ్లలో చెప్పుకోవాలంటే గీతూ రేవంత్ అని చెప్పాలి. అయితే గత వారం జరిగిన ఎలెమినేషన్ రౌండ్ లో గీతూ ని ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ లో గెలిచిన,ఎలిమినేట్ అయినా సరే ఇంటర్వ్యూలు, పార్టీలు అంటూ కొంచెం హడావిడి చేస్తారు. కానీ గీతు ఎలిమినేట్ అయిన తర్వాత చాలా సైలెంట్ గా ఉండిపోయింది. దీంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకా గీతు ఎలిమినేషన్ బాధ నుంచి బయటకు వచ్చినట్లు కనిపించట్లేదు. ఇక ఇప్పుడు గీతూ ఏడుస్తూ పోస్ట్ చేసిన ఒక వీడియో దీనికి ఉదాహరణ అని చెప్పవచ్చు.అయితే గత సీజన్స్ తో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ అంతా ఇంట్రెస్టింగ్ గా లేదని చెప్పాలి.

అయినా సరే ప్రేక్షకులు ఈ సీజన్ ను వీక్షిస్తున్నారు అంటే దానికి కారణం గీతూ .మొదటి ఎపిసోడ్ నుంచే ఫుల్ ఎనర్జీతో అందర్నీ డామినేట్ చేసింది. ఇక గీతూ ని చూసి మిగతా హౌస్ సభ్యులు కూడా భయపడిపోయేవారు. అలా మొదటి ఎపిసోడ్ నుంచి తన చివరి ఎపిసోడ్ వరకు గీతు ఆడిందే ఆటగా జరిగింది .అయితే దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది కదా. బహుశా గీతూ ఆ లిమిట్ ను క్రాస్ చేసిందేమో. అందుకే బిగ్ బాస్ గీతూ ను ఎలిమినేట్ చేసి ఉంటుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ముందు కూడా నన్ను పంపించొద్దు అని గీతూ ఏడ్చిన తీరు చూసి ప్రతి ఒక్కరూ బాధపడ్డారు. ఇష్టం లేకపోయినా సరే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే హౌస్ నుంచి బయటికి వచ్చి ఇన్ని రోజులు అవుతున్న ఆమె ఇంతవరకు బయటకు రాలేదు. అలాగే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ తప్ప మరే ఇతర ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు. దీంతో గీతూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని రూమర్స్ వస్తున్నాయి.

Bigg Boss Geetha Royal cried live saying she was cheated

Bigg Boss Geetha Royal cried live saying she was cheated

ఇక ఈ రూమర్స్ కి దీటుగా సమాధానం చెబుతూ తన యూట్యూబ్ ఛానల్లో వీడియోను పోస్ట్ చేసింది గీతూ. బిగ్ బాస్ ప్రయాణంలో తాను నేర్చుకున్న గుణపాటాలను తాను బయటకు రావడానికి గల కారణాలను చెబుతూ గంట దాకా మాట్లాడింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు నన్ను ప్రమోట్ చేయమని చెప్పి కొందరికి 25000 డబ్బులు ఇచ్చానని కాని వారు నన్ను మోసం చేశారని, నా గురించి ఒక్క పాజిటివ్ కామెంట్స్ కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. నా అనుకున్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేస్తారని ధైర్యంతో హౌస్ లోకి వెళ్ళానని కానీ ఏ ఒక్కరూ నాకు మద్దతు గా నిలవలేదని, ఈ విషయం నన్ను చాలా బాధ పెట్టిందంటూ చెప్పుకొచ్చింది. ఇంకా నా గేమ్ ను తప్పుపడుతున్నారు అభిజిత్ కౌశల్ కంటే నేనేం తక్కువ … అని ఏడుస్తూ మాట్లాడిన వీడియో ను గీతూ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది