pushpa 2 : పుష్ప‌2లో ఆరు నిమిషాల స‌న్నివేశానికి రూ.60 కోట్లు ఖర్చు చేశారా.. ఇది అరాచ‌క‌మే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

pushpa 2 : పుష్ప‌2లో ఆరు నిమిషాల స‌న్నివేశానికి రూ.60 కోట్లు ఖర్చు చేశారా.. ఇది అరాచ‌క‌మే..!

pushpa 2 : అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప 2. పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఆగ‌స్ట్ 15న మూవీని విడుద‌ల చేసే ప్లాన్‌లో ఉన్నారు మేక‌ర్స్. అయితే సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా బన్నీ బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అల్లు అర్జున్ అవతారం ప్రేక్షకులతో విజిల్ వేయించింది. గతంలో అల్లు అర్జున్ గంగమ్మ అవతారాన్ని పోస్టర్ రూపంలో విడుదల చేయ‌గా, ఇప్పుడు టీజర్‌లో […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 April 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  pushpa 2 : పుష్ప‌2లో ఆరు నిమిషాల స‌న్నివేశానికి రూ.60 కోట్లు ఖర్చు చేశారా.. ఇది అరాచ‌క‌మే..!

pushpa 2 : అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రం పుష్ప 2. పుష్ప మూవీకి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఆగ‌స్ట్ 15న మూవీని విడుద‌ల చేసే ప్లాన్‌లో ఉన్నారు మేక‌ర్స్. అయితే సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా బన్నీ బ‌ర్త్‌డేని పుర‌స్క‌రించుకొని టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో అల్లు అర్జున్ అవతారం ప్రేక్షకులతో విజిల్ వేయించింది. గతంలో అల్లు అర్జున్ గంగమ్మ అవతారాన్ని పోస్టర్ రూపంలో విడుదల చేయ‌గా, ఇప్పుడు టీజర్‌లో పూర్తి విశ్వ‌రూపాన్ని క‌ళ్ల ముందు ఉంచారు. ఇది ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇంకా బ‌న్నీ సినిమాలో విశ్వ‌రూపం క‌న‌బ‌రుస్తాడ‌ని ఈ సినిమాతో ఎక్క‌డితో వెళతాడ‌ని అంటున్నారు.

pushpa 2 : రోమాలు నిక్క‌బొడుచుకోవల్సిందే..

అయితే టీజ‌ర్ లో గంగ‌మ్మ జాత‌ర‌కి సంబంధించిన సీన్ గురించి చ‌ర్చ న‌డుస్తుంది. జాతర సందర్భంగా వచ్చే పాట, సన్నివేశం పుష్ప-2 సినిమాలో ఆరు నిమిషాల పాటు ఉంటుందని, ఇది మూవీకే హైలైట్‌గా నిలుస్తుంద‌ని ముందు నుండి నిర్మాత‌లు చెబుతున్న మాట‌. అయితే ఆరు నిమిషాల సన్నివేశానికి అర‌వై కోట్లు వ‌రకు ఖ‌ర్చు చేసిన‌ట్టు స‌మాచారం. ఈ సీన్‌కి సంబంధించిన షూటింగ్ నెల రోజుల పాటు చేశార‌ని, సుకుమార్ చాలా క‌ష్ట‌ప‌డి ఆ సీన్‌ని చేసిన‌ట్టు టాక్. సినిమాకి చాలా ప్రాధాన్యం ఉంది కాబ‌ట్టే ఆయ‌న ఈ సీన్ చేశార‌ని అంటున్నారు. పుష్ప‌1ని మించి ఈ మూవీకి బ‌డ్జెట్ కేటాయించిన‌ట్టు తెలుస్తుంది. పుష్ప‌తో జాతీయ అవార్డ్ అందుకున్న ఎన్టీఆర్ రెండో పార్ట్‌తో మరిన్ని అవార్డులు ద‌క్కించుకోవ‌డం ఖాయంగా చెబుతున్నారు.

pushpa 2 పుష్ప‌2లో ఆరు నిమిషాల స‌న్నివేశానికి రూ60 కోట్లు ఖర్చు చేశారా ఇది అరాచ‌క‌మే

pushpa 2 : పుష్ప‌2లో ఆరు నిమిషాల స‌న్నివేశానికి రూ.60 కోట్లు ఖర్చు చేశారా.. ఇది అరాచ‌క‌మే..!

పుష్ప2 రిలీజ్ డేట్ విష‌యంలో అంద‌రిలో అనేక అనుమానాలు ఉండ‌గా, దానికి టీజ‌ర్‌తో క్లారిటీ వ‌చ్చింది. టీజర్ విడుదలైన సందర్భంగా ఆగస్టు 15న చిత్రాన్ని రిలీజ్ చేస్తామని.. నిర్మాతలు ప్రకటించడంతో అన్ని రూమర్స్‌కి చెక్ ప‌డింది. పుష్ప సినిమాని అన్ని భాష‌ల‌లో విడుద‌ల చేస్తున్నారు. మూవీ సంచ‌లనం సృష్టించ‌డం ఖాయంగా చెబుతున్నారు. మూవీలో తెలుగు భాష‌కి చెందిన న‌టులతో పాటు వేరే భాష‌ల‌కి చెందిన న‌టులు కూడా భాగం కానున్నారు. పుష్పని మించి పుష్ప‌2 ఉంటుంద‌ని ఈ రెండింటిని మించి పుష్ప 3 ఉంటుందని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది