Pushpa 3 : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్.. పుష్ప‌3 రిలీజ్ డేట్ ఫిక్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 3 : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్.. పుష్ప‌3 రిలీజ్ డేట్ ఫిక్స్

 Authored By ramu | The Telugu News | Updated on :17 March 2025,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Pushpa 3 : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్.. పుష్ప‌3 రిలీజ్ డేట్ ఫిక్స్

Pushpa 3 : పుష్ప ఫ్రాంచైజీతో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్నారు సుకుమార్. పుష్ప 1 సినిమా 2021లో రిలీజైంది. ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక గతేడాది రిలీజైన పుష్ప 2 ఏకంగా ఇండియన్ సినిమా బాక్సాఫీస్ రికార్డులు కొల్లగొట్టింది. ఏకంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక పుష్ప 2 సినిమా ఎండింగ్ లో పుష్ప 3 కూడా ఉంటుందని చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్.

Pushpa 3 అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్ పుష్ప‌3 రిలీజ్ డేట్ ఫిక్స్

Pushpa 3 : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్.. పుష్ప‌3 రిలీజ్ డేట్ ఫిక్స్

Pushpa 3  ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్..

అయితే పుష్ప‌3 ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు రిలీజవుతుంది? అన్న దానిపై అంద‌రిలో అనేక అనుమానాలు ఉన్నాయి. తాజాగా పుష్ప 3 సినిమా గురించి నిర్మాత రవిశంకర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 2028లో పుష్ప 3 సినిమాను విడుదల చేస్తామని వెల్లడించాడు. రాబిన్ హుడ్ ప్రమోషన్లలో భాగంగా ఆయన పుష్ప 3 సినిమా రిలీజ్ గురించి చెప్పాడు. అలాగే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీతో ఓ సినిమా చేస్తున్న సంగతిని కూడా బయటపెట్టాడు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా హిట్ చిత్రం పుష్ప 2 ఇండియన్ సినిమా దగ్గర ఆల్ టైం బిగ్గెస్ట్ గ్రాసర్(చైనా రిలీజ్ కాకుండా) గా రికార్డులు తిరగరాసింది. ఇక ఈ సినిమాకి కూడా మేకర్స్ మరో సీక్వెల్ పుష్ప 3 ది ర్యాంపేజ్ అనౌన్స్ చేయ‌గా, ఇదెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో అని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది