PushpaPushpa Song : పుష్ప‌2 ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది.. పూన‌కాలు తెప్పిస్తున్న దేవి శ్రీ మ్యూజిక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

PushpaPushpa Song : పుష్ప‌2 ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది.. పూన‌కాలు తెప్పిస్తున్న దేవి శ్రీ మ్యూజిక్..!

 Authored By ramu | The Telugu News | Updated on :1 May 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  PushpaPushpa Song : పుష్ప‌2 ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది.. పూన‌కాలు తెప్పిస్తున్న దేవి శ్రీ మ్యూజిక్..!

PushpaPushpa Song : అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సుకుమార్ తెర‌కెక్కిస్తున్న‌ పాన్ ఇండియా చిత్రం పుష్ప‌2. ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది . ఆగ‌స్ట్ 15న చిత్రాన్ని విడుద‌ల చేసే క్ర‌మంలో సుకుమార్ షూటింగ్ స్పీడ్ పెంచాడు. మ‌రోవైపు ప్ర‌మోష‌న్స్ కూడా మొద‌లు పెట్టాడు. ఇటీవ‌ల ఈ మూవీ నుంచి మ్యూజికల్ అప్‌డేట్ ఇస్తూ ఫస్ట్ సింగిల్‌ ప్రోమో పుష్ప పుష్పని విడుద‌ల చేశారు. ఇది టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇక ఫుల్ సాంగ్‌ని ఈ రోజు రిలీజ్ చేస్తున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. అయితే ఆ సాంగ్ లాంచ్ క‌న్నా ముందు బ‌న్నీకి సంబంధించిన లుక్స్ విడుద‌ల చేస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

PushpaPushpa Song : కిక్కిస్తున్న ఫ‌స్ట్ సాంగ్.

అయితే కొద్ది సేప‌టి క్రిత‌మే మూవీకి సంబంధించిన తొలి సాంగ్ విడుద‌లైంది. ఇది మూవీపై భారీ అంచ‌నాలు పెంచేసింది. బ‌న్నీ లుక్స్, దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ మాంచి కిక్ ఇచ్చింది. ఇక ఫ‌స్ట్ సాంగ్‌తోనే అభిమానుల‌లో జోష్ రాగా, రానున్న రోజుల‌లో ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్‌డేట్ అయిన కిక్కివ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇక తొలి పాటని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతోపాటు బెంగాళీ భాషల్లో విడుదల చేసారు. ఇక సీక్వెల్‌లో కన్నడ భామ రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్‌ పోషిస్తోండగా.. ఫహద్‌ ఫాసిల్, జగదీష్‌ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్‌ రాజ్‌, సునీల్‌, అనసూయ భరద్వాజ్‌, రావు రమేశ్‌, ధనంజయ, షణ్ముఖ్‌, అజయ్‌, శ్రీతేజ్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

PushpaPushpa Song పుష్ప‌2 ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది పూన‌కాలు తెప్పిస్తున్న దేవి శ్రీ మ్యూజిక్

PushpaPushpa Song : పుష్ప‌2 ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది.. పూన‌కాలు తెప్పిస్తున్న దేవి శ్రీ మ్యూజిక్..!

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ అందిస్తు్న్నాడు. పుష్ప ది రూల్‌ ఆడియో హక్కులను అన్ని భాషల్లో పాపులర్ కంపెనీ భూషణ్‌ కుమార్‌ టీ సిరీస్‌ దక్కించుకుంది. పుష్ప 2 పాన్ ఇండియా డెఫినిషన్ మార్చేయాలని డిసైడ్ అయ్యింది. బెంగాలీ భాషలోనూ పుష్ప 2 రిలీజ్ కానుంది. తద్వారా బెంగాలీలో విడుదలవుతోన్న తొలి పాన్ ఇండియా సినిమాగా పుష్ప 2 రికార్డుల్లోకెక్కింది. ఇక రానున్న రోజుల‌లో బ‌న్నీ మూవీ మ‌రెన్ని సంచ‌ల‌నాలు సృష్టిస్తుందో చూడాలి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది