PV Sindhu comments on marriage
PV Sindhu : పెళ్లిపై స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సంచలన కామెంట్స్ చేసింది.తనకు అలాంటి ఉద్దేశం ఇప్పుడు లేదని పేర్కొంది. పతకాలకు కేరాఫ్ అడ్రస్ పీవీ సింధు. పలు జాతీయ,అంతర్జాతీయ మెడల్స్‌ను సాధించడంతో పాటు దేశానికి మంచి పేరు తీసుకురావడంలో చాలా కృషి చేసింది.పీవీ సింధు చాలా మందిలో క్రీడా స్పూర్తి నింపింది.ఈమెకు దేశవ్యాప్తంగా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందులో సినిమా వాళ్లు, క్రీడాకారులు కూడా ఉన్నారు. రియో ఒలంపిక్స్‌లో మెడల్ సాధించిన సింధూ.. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
పీవీ సింధు స్పోర్ట్స్ ఆడుతూనే సొంతంగా అకాడమీ ప్రారంభించాలని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే సింధు తాజాగా ఆలీతో సరదాగా అనే టాక్ షోలో సందడి చేసింది. ఇందులో ఆమె అల్లరి తనం చూసి అంతా షాక్ అయ్యారు. ఆమె చురుకుదనం, అల్లరి మాటలు చూసి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సింధు ఇంట్లో ఇంత అల్లరి చేస్తుందా అని అనుకుంటున్నారు. ఈ షోలో సింధు తన గేమ్ లైఫ్ గురించి కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా అలీ సింధును కొన్ని ప్రశ్నలు వేశారు. ఇండస్ట్రీలో మీకు మంచి స్నేహితుడు ఎవరు అని అడుగగా.. ‘నాకు చాలా మంది హీరోలు స్నేహితులుగా ఉన్నారు అని సింధు చెప్పగా.. అందులో ఒకరి పేరు చెప్పాలని అలీ అడిగాడు.
PV Sindhu comments on marriage
వెంటనే సింధు ప్రభాస్ పేరు చెబుతుంది. అప్పుడు ఆలీ ఎందుకు మీ అంత హైట్ ఉన్నాడని ప్రభాస్ పేరు చెప్పారా అని అడుగగా.. అవును అవును అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది.ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అని అలీ అడుగగా.. సింధు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.తనకు ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన సింధు.. తన ఫోకస్ మొత్తం 2024 ఒలంపిక్స్ గేమ్స్ పైనే ఉన్నాయని తెలిపింది.ఎలాగైనా సరే ఆ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది.ఇక ఇండస్ట్రీలో తనకు చాలా మంది స్నేహితులతో పాటు బంధువులు కూడా ఉన్నారని పేర్కొంది. అయితే, తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానని.. అందుకోసం ఇంకా టైం ఉందని తెలిపింది. కానీ సినిమా వాళ్లను మాత్రం అస్సలు చేసుకోను అని సింధు స్పష్టంచేసింది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.