Dhee 14 Dance Show : ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ 14 షో లో మళ్లీ బిగ్ బాస్ అఖిల్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీజన్ లోనే మధ్య లో బ్రేక్ అయ్యి బిగ్ బాస్ నాన్ స్టాప్ కు వెళ్లిన అఖిల్ మళ్లీ అనూహ్యంగా ఢీ 14 లో సందడి చేస్తున్నాడు. గతంలోనే పెద్దగా ఆయన కామెడీకి మార్కులు పడలేదు. కానీ మరెవ్వరు లేకనో లేదా మరేంటో కానీ ఆయన్ను మళ్లీ తీసుకు వచ్చారు. సాదారణంగా అయితే బిగ్ బాస్ లో పాల్గొన్న వారికి ఈటీవీలో ఇంత త్వరగా అవకాశం రాదు.. కానీ అఖిల్ కు మాత్రం ఈజీగా నే రీ ఎంట్రీ లభించింది. ఆయన తక్కువ పారితోషికం తీసుకుంటున్న కారణంగానే మళ్లీ తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.
ప్రస్తుతం ఢీ షో లో అఖిల్ పాల్గొంటున్నందుకు గాను ఒక్క కాల్షీట్ కి లక్షన్నర మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నాడట. సాదారణ కంటెస్టెంట్ కు కూడా లక్ష వరకు పారితోషికం ఉంటుంది. అలాంటిది అఖిల్ కి లక్షన్నర పారితోషికం అంటే చాలా తక్కువ అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ గతంలో బిగ్ బాస్ లో ఉన్న సమయంలో వారంకు రెండున్నర లక్షల రూపాయల వరకు పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయంలో నిజం ఎంతో కానీ ఇప్పుడు మాత్రం రోజుకు లక్షన్నర పారితోషికం తీసుకుంటున్నాడట.
అఖిల్ తో పాటు ఇతర టీమ్ లీడర్ల కు కూడా చాలా తక్కువ పారితోషికం ఉంటుందట. కానీ హైపర్ ఆదికి మాత్రమే ఒక్క కాల్షీట్ కి ఏకంగా అయిదు లక్షల వరకు పారితోషికం ఉంటుందట. జడ్జ్ ల స్థాయి లో ఆది కి పారితోషికం ఉంటుందని బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైపర్ ఆది ఏం చేసినా కూడా స్పెషల్ గా ఉంటుంది. కనుక ఆయనకు భారీ పారితోషికం ఇవ్వడం లో ఎలాంటి అనుమానం లేదు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వ్యక్తిగా హైపర్ ఆదికి మంచి పేరు కూడా దక్కింది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.