Hyper Aadi : వయసులో తనకంటే చాలా చిన్నవాడైనా గాని స్టేజిపై అందరూ చూస్తుండగానే హైపర్ ఆదికి దండం పెట్టిన ఆర్.నారాయణమూర్తి.. వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : వయసులో తనకంటే చాలా చిన్నవాడైనా గాని స్టేజిపై అందరూ చూస్తుండగానే హైపర్ ఆదికి దండం పెట్టిన ఆర్.నారాయణమూర్తి.. వీడియో వైరల్..!!

Hyper Aadi : తెలుగు సినిమా, టెలివిజన్ ప్రేక్షకులలో హైపర్ ఆది పేరు తెలియని వారు ఉండరు. జబర్దస్త్ కామెడీ షోలో తన అదిరిపోయే పంచ్ డైలాగులతో ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసే కంటెస్టెంట్ హైపర్ ఆది. తన ప్రాస మరియు యాసతో అది టెలివిజన్ అయినా సినిమాలో పాత్ర అయినా సరైన న్యాయం చేసే ఆర్టిస్ట్. అంతేకాదు సినిమా వేడుకలలో రాజకీయ వేదికలపై కూడా తనదైన శైలిలో పంచ్ పవర్ తో తన స్పీచ్ తో ఎంతోమందిని […]

 Authored By sekhar | The Telugu News | Updated on :21 February 2023,4:00 pm

Hyper Aadi : తెలుగు సినిమా, టెలివిజన్ ప్రేక్షకులలో హైపర్ ఆది పేరు తెలియని వారు ఉండరు. జబర్దస్త్ కామెడీ షోలో తన అదిరిపోయే పంచ్ డైలాగులతో ఎంతో ఎంటర్టైన్మెంట్ చేసే కంటెస్టెంట్ హైపర్ ఆది. తన ప్రాస మరియు యాసతో అది టెలివిజన్ అయినా సినిమాలో పాత్ర అయినా సరైన న్యాయం చేసే ఆర్టిస్ట్. అంతేకాదు సినిమా వేడుకలలో రాజకీయ వేదికలపై కూడా తనదైన శైలిలో పంచ్ పవర్ తో తన స్పీచ్ తో ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇటీవల కొద్ది సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. తెలుగులో మాత్రమే కాదు తమిళ సినిమా రంగంలో కూడా హైపర్ ఆదికి అవకాశాలు వస్తున్నాయి.

R Narayana Murthy Making Fun On Hyper Aadi

R Narayana Murthy Making Fun On Hyper Aadi

ఈ నేపథ్యంలో ఇటీవల తమిళ హీరో ధనుష్ నటించిన “సార్” సినిమాలో హైపర్ ఆది కీలక పాత్ర పోషించడం జరిగింది. ఫిబ్రవరి 17వ తారీకు విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంతగానో అల్లరించింది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో సోమవారం.. సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్.నారాయణమూర్తి రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హీరో ధనుష్ నీ పొగడ్తలతో ముంచెత్తారు. ఇంకా సినిమా దర్శకుడు మరియు నిర్మాతని ప్రశంసించారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా హైపర్ ఆదిని ఆర్.నారాయణమూర్తి ప్రశంసించడం జరిగింది. తెలుగు సినిమా రంగంలో కస్తూరి శివరావు, రేలంగి, రాజబాబు..

R Narayana Murthy Praises Hyper Aadi | #Sir #Vaathi Movie Success Meet -  YouTube

ప్రస్తుతం బ్రహ్మానందం ఎలా చూస్తున్నామో అదే కోవాలో.. వస్తున్న చాలామంది కమెడియన్లలో హైపర్ ఆది ప్రముఖుడు అని ప్రశంసించారు. కామెడీ చేయటం అనేది మామూలు విషయం కాదు. సినిమాలో ఏడిపించడం చాలా ఈజీ, నవ్వించడం చాలా కష్టం. కానీ సినిమాలో నవ్వు ఆపుకో లేకుండా పంచ్ లతో …. నవించావు..నీకు దండం అయ్యా బాబు అంటూ… ప్రశంసించారు. ఆర్.నారాయణమూర్తి మాటలకు హైపర్ ఆది ఆయన కాలకీ దండం పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వయసు పరంగా తనకంటే చిన్నవాడైనా గాని హైపర్ ఆదికి స్టేజిపై అందరూ చూస్తుండగా సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి దండం పెట్టడం అందరికి షాక్ కీ గురి చేసింది.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది