Raashi Khanna : రాశీ ఖ‌న్నా అందాల ఆర‌బోత‌.. బ్లూ సూట్‌లో మెస్మరైజ్ చేస్తున్న క్యూట్ బ్యూటీ

Authored By Sam C | The Telugu News | Published on: March 15, 2022, 3:30 pm

Raashi Khanna : అందానికే అసూయ‌పుట్టేలా చేసే అందాల ముద్దుగుమ్మ రాశీ ఖ‌న్నా. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా… ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ హిట్, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. గత కొద్ది రోజులుగా ట్రెండీ అవుట్ ఫిట్ లో తాజా ఫొటోషూట్లు చేస్తూ యువకుల గుండెల్లో నిద్రపోతోంది. వీకెండ్ గ్లామర్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ప్రస్తుతం తెలుగులో మారుతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంతో పాటు నాగచైతన్య విక్రమ్ కుమార్ థాంక్యూలో కూడా హీరోయిన్‌గా చేస్తోంది. ఇక అది అలా ఉంటే రాశీ ఖన్నా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్‌ల్లోను అదరగొడుతోంది. అందులో భాగంగా ఈ భామ ఇప్పటికే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో వస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తుండగా.. తాజాగా మరో వెబ్ సిరీస్‌లో నటించడానికి ఒప్పుకుందని తెలుస్తోంది. తాజాగా ఈమె అజయ్ దేవ్‌గణ్ మొదటి సారి నటించిన వెబ్ సిరీస్‌ ‘రుద్ర’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో మెయిన్ లీడ్‌లో నటిస్తోంది. రీసెంట్‌గా విడుదల చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

raashi khanna cute looks viral

raashi khanna cute looks viral

Raashi Khanna : రాశీ క్యూట్ నెస్..

రాశీ ఖ‌న్నా ఇటీవ‌లి కాలంలో గ్లామ‌ర్ షోతోను తెగ మెప్పిస్తుంది. ఈ అమ్మ‌డు ఎద అందాల‌తో పాటు థైస్ షో చేస్తూ సెగ‌లు రేపుతుంది. తాజాగా బ్లూ క‌ల‌ర్ సూట్‌లో జిగేల్ మ‌నేలా అందాలు ఆర‌బోస్తూ ర‌చ్చ చేస్తుంది. ఈ అమ్మ‌డి క్యూట్ నెస్‌కి కుర్ర‌కారు మ‌మైర‌చిపోతున్నారు. టాలీవుడ్ ను ఏలే అంతా రేంజ్ రాఖీ ఖన్నాకు ఇంకా రాకపోయినా వరుస సినిమాలతో మాత్రం అలరిస్తోంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగించుకుంటూ బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఈ మేరకు ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు సిద్ధంగా ఉంది.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp