Raashi Khanna : బ్లాక్ డ్రెస్‌లో సెగ‌లు రేపుతున్న రాశీ ఖన్నా.. థ్రిల్ అవుతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Raashi Khanna : బ్లాక్ డ్రెస్‌లో సెగ‌లు రేపుతున్న రాశీ ఖన్నా.. థ్రిల్ అవుతున్న ఫ్యాన్స్

Raashi Khanna : క్యూట్ లుక్స్‌తో పాటు మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఫలితంగా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ నటిస్తోంది. చిన్న వయసులోనే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :14 June 2022,8:00 pm

Raashi Khanna : క్యూట్ లుక్స్‌తో పాటు మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్న హీరోయిన్ రాశీ ఖన్నా. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ హవాను చూపించింది. ఫలితంగా తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్‌లోనూ నటిస్తోంది. చిన్న వయసులోనే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన రాశీ ఖన్నా ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత నాగశౌర్య హీరోగా నటించిన ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ మూవీలో బబ్లీ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ భామ.. నటిగానూ మెప్పించింది. ఆ తర్వాత వరుసగా సినిమాలను చేస్తూ పాపులర్ అయింది. కెరీర్ ఆరంభం నుంచే చాలా విజయాలను దక్కించుకుంటోన్న రాశీ ఖన్నా.. మధ్యలో కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడింది. అయితే, ‘వెంకీ మామ’, ‘ప్రతిరోజూ పండగే’తో వరుస హిట్లను అందుకుంది. ఈ క్రమంలోనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో ఫ్లాప్‌ను చవి చూసింది. ఇక, ఇటీవలే ఈమె ‘రుద్ర’ అనే సిరీస్‌లో సైకో పాత్రలో అదరగొట్టింది. వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న రాశీ ఖన్నా వరుస ఆఫర్లతో ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈమె తెలుగులో నాగ చైతన్యతో ‘థ్యాంక్యూ’, గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్’లో నటిస్తోంది.

raashi khanna saree looks viral

raashi khanna saree looks viral

Raashi Khanna : రాశీ అద‌ర‌గొట్టే అందం..

అలాగే, తమిళంలో ‘తుగ్లక్ దర్బార్’, ‘అరన్మనై 3’, ‘మేథావి’, ‘సైతాన్ కా బచ్చా’.. మలయాళంలో ‘బ్రహ్మమ్’ అనే మూవీలు చేసింది. అలాగే, హిందీలోనూ సినిమాలు చేస్తూనే ఉంది. రాశీ ఖన్నా.. గోపీచంద్‌తో కలిసి ‘పక్కా కమర్షియల్’ అనే చిత్రంలో నటిస్తోంది. ఆదివారం గోపీచంద్ పుట్టనరోజు సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కూడా రాశీ ఓ కామెడీ లాయర్ పాత్రలో నటించింది. అందుకే పక్కా కమర్షియల్ చిత్రంలో తాను హీరోయిన్ కాదు కమెడియన్ అంటూ వ్యాఖ్యలు చేసింది.అయితే మూవీ రిలీజ్ సంద‌ర్భంగా రాశీ ఖ‌న్నా క్యూట్ లుక్స్ లో మెస్మ‌రైజ్ చేసింది. అదిరిపోయే అందాల‌తో రెచ్చ‌గొట్టింది. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ బ్లాక్ శారీలో కేక పెట్టించే అందాల‌తో థ్రిల్ చేస్తుంది. రాశీ క్యూట్ పిక్స్ నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది