Racha Ravi Busy New Nexa Grand Vitara Car on Dasara 2022
Racha Ravi ; దసరాకు మన తారలంతా కూడా కొత్త కార్లు కొనేశారు. బుల్లితెర తారలే ఎక్కువగా కార్ల మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. షన్ను, శివ జ్యోతి, సత్తి, రచ్చ రవి, వైవా హర్ష ఇలా చాలా మంది కొత్త కార్లు కొనేశారు. దసరా నాడు గ్రాండ్‌గా ఓపెన్ చేశారు. ప్రతీ ఒక్కరూ లగ్జరీ కార్లనే కొనేశారు. షన్ను, శివ జ్యోతిలు ఇద్దరూ కూడా బీఎండబ్ల్యూని కొనేశారు. బిత్తిరి సత్తి.. అయితే తన రేంజ్‌కు తగ్గట్టుగా రేంజ్ రోవర్‌ను కొనేశాడు. ఇక కమెడియన్ వైవా హర్ష అయితే.. ఆడి కారుని కొనేశాడు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలను వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రచ్చ రవి అయితే ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. బుల్లితెర, వెండితెరపై రచ్చ రవి సత్తా చాటుతున్నాడు. జబర్దస్త్ షోలో బాగానే పాపులర్ అయ్యాడు. చమ్మక్ చంద్ర టీంలో పని చేశాడు. సొంతంగా టీం లీడర్ స్థాయికి వెళ్లాడు. నాగబాబు బయటకు వెళ్లడంతో చమ్మక్ చంద్ర వెళ్లిపోయాడు. చమ్మక్ చంద్ర, నాగబాబుతో కలిసి రచ్చ రవి సైతం అదిరింది, బొమ్మ అదిరింది అనే షోలకు వెళ్లాడు. మధ్యలో కొన్ని రోజులు కామెడీ స్టార్స్ షో చేశాడు. అయితే ఈ మధ్యే మళ్లీ మల్లెమాల సంస్థలోకి వచ్చాడు. మొన్న జరిగి ఈవెంట్లో రచ్చ రవి ఎమోషనల్ అయ్యాడు. జబర్దస్త్ తనకు అమ్మ లాంటిదని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.
Racha Ravi Busy New Nexa Grand Vitara Car on Dasara 2022
మామూలుగా అయితే రచ్చ రవి ఎక్కువగా సినిమాల్లో నటించేందుకే ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇప్పుడు రచ్చ రవి తన కొత్త కారుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. గ్రాండ్ వింటారా కారుని కొన్నట్టుగా చెప్పుకొచ్చాడు. షోరూంలో తాను చేసిన రచ్చ గురించి చెబుతూ.. వీడియోను షేర్ చేశాడు రచ్చ రవి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే రచ్చ రవి కొన్న ఈ కారు విలువ దాదాపు ఇరవై లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి రచ్చ రవి తన రేంజ్‌కు తగ్గట్టుగా మంచి కారునే కొనేశాడు. అందరూ కూడా రచ్చ రవికి కంగ్రాట్స్ చెబుతున్నారు.. పార్టీ ఇవ్వమని అడుగుతున్నారు. రచ్చ రవి ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా, బుల్లితెర, వెండితెర ద్వారా బాగానే సంపాదిస్తోన్నట్టుకనిపిస్తోంది.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.