Racha Ravi : కొత్త కారు కొన్న రచ్చ రవి.. వీడియో వైరల్.. ధర ఎంతంటే?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: October 7, 2022, 9:30 pm

Racha Ravi ; దసరాకు మన తారలంతా కూడా కొత్త కార్లు కొనేశారు. బుల్లితెర తారలే ఎక్కువగా కార్ల మీద ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. షన్ను, శివ జ్యోతి, సత్తి, రచ్చ రవి, వైవా హర్ష ఇలా చాలా మంది కొత్త కార్లు కొనేశారు. దసరా నాడు గ్రాండ్‌గా ఓపెన్ చేశారు. ప్రతీ ఒక్కరూ లగ్జరీ కార్లనే కొనేశారు. షన్ను, శివ జ్యోతిలు ఇద్దరూ కూడా బీఎండబ్ల్యూని కొనేశారు. బిత్తిరి సత్తి.. అయితే తన రేంజ్‌కు తగ్గట్టుగా రేంజ్ రోవర్‌ను కొనేశాడు. ఇక కమెడియన్ వైవా హర్ష అయితే.. ఆడి కారుని కొనేశాడు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలను వీడియోలు వైరల్ అవుతున్నాయి.

రచ్చ రవి అయితే ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. బుల్లితెర, వెండితెరపై రచ్చ రవి సత్తా చాటుతున్నాడు. జబర్దస్త్ షోలో బాగానే పాపులర్ అయ్యాడు. చమ్మక్ చంద్ర టీంలో పని చేశాడు. సొంతంగా టీం లీడర్ స్థాయికి వెళ్లాడు. నాగబాబు బయటకు వెళ్లడంతో చమ్మక్ చంద్ర వెళ్లిపోయాడు. చమ్మక్ చంద్ర, నాగబాబుతో కలిసి రచ్చ రవి సైతం అదిరింది, బొమ్మ అదిరింది అనే షోలకు వెళ్లాడు. మధ్యలో కొన్ని రోజులు కామెడీ స్టార్స్ షో చేశాడు. అయితే ఈ మధ్యే మళ్లీ మల్లెమాల సంస్థలోకి వచ్చాడు. మొన్న జరిగి ఈవెంట్లో రచ్చ రవి ఎమోషనల్ అయ్యాడు. జబర్దస్త్ తనకు అమ్మ లాంటిదని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు.

Racha Ravi Busy New Nexa Grand Vitara Car on Dasara 2022

Racha Ravi Busy New Nexa Grand Vitara Car on Dasara 2022

మామూలుగా అయితే రచ్చ రవి ఎక్కువగా సినిమాల్లో నటించేందుకే ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇప్పుడు రచ్చ రవి తన కొత్త కారుకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. గ్రాండ్ వింటారా కారుని కొన్నట్టుగా చెప్పుకొచ్చాడు. షోరూంలో తాను చేసిన రచ్చ గురించి చెబుతూ.. వీడియోను షేర్ చేశాడు రచ్చ రవి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అయితే రచ్చ రవి కొన్న ఈ కారు విలువ దాదాపు ఇరవై లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి రచ్చ రవి తన రేంజ్‌కు తగ్గట్టుగా మంచి కారునే కొనేశాడు. అందరూ కూడా రచ్చ రవికి కంగ్రాట్స్ చెబుతున్నారు.. పార్టీ ఇవ్వమని అడుగుతున్నారు. రచ్చ రవి ప్రస్తుతం యూట్యూబ్, సోషల్ మీడియా, బుల్లితెర, వెండితెర ద్వారా బాగానే సంపాదిస్తోన్నట్టుకనిపిస్తోంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Gold Rate Today : 21 నవంబర్ 2026 బంగారం కొనాలనుకునేవారికి బంపర్ ఛాన్స్.. వెండి ధర కూడా భారీగా తగ్గింది.!"

  2. "Nara Lokesh CM : ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్?.. సీఎంగా లోకేష్.. చంద్రబాబు పాత్ర ఏంటనే చర్చ!"

  3. "Bigg Boss 10 Telugu : ఇదెక్కడి ట్విస్ట్ రా బాబూ.. త్రిగుణ్‌కు షాకిచ్చిన ముకేష్.. ఓటింగ్‌లో కొత్త లెక్కలు !"

  4. "Today Horoscope : 21 నవంబర్ 2026 శ‌నివారం ఈ రోజు మీ రాశి ఫలాలు..ఆ 4 రాశులకు ధనలాభం.. ఊహించని సర్‌ప్రైజ్!"

  5. "China USA Gold : అమెరికాకు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. భారీగా బంగారం కొనుగోళ్లు.. అసలు ప్లాన్ ఏంటి..?"

  6. "Rashmika Mandanna : రష్మిక కొత్త లుక్ అదుర్స్.. ‘ఒసేయ్ రాములమ్మ’ పాట లాంచ్‌లో నేషనల్ క్రష్ సందడి!"

  7. "Redmi Turbo 6 Max : రెడ్‌మి నుంచి మరో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 185Hz డిస్‌ప్లే, భారీ బ్యాటరీ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp