Racha Ravi : రచ్చ రవి అంత ఎదిగాడా.. ఆ కారు ఖరీదు వింటే అమ్మో అంటారు

Authored By Sam C | The Telugu News | Published on: October 11, 2022, 5:30 pm

Racha Ravi : రచ్చ రవి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు అనుకుంటా..! ఎందుకంటే జబర్దస్త్ కామెడీ షో నుంచి మనోడు బాగానే పాపులర్ అయ్యాడు. దానికి ముందు కొన్ని సినిమాలు చేసినా కూడా ఎవరు ఈయన గుర్తుపట్టే వాళ్ళు కాదు. కానీ ఆ తర్వాత చమ్మక్ చంద్ర టీంలో రచ్చ రవి చేసిన కామెడీ చాలా కాలం పాటు ప్రేక్షకులు గుర్తుండిపోయింది. ఈయన జబర్దస్త్ మానేసినా కూడా ప్రేక్షకులు ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్ గానే చూస్తారు. ఆయన అక్కడ మానేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. అయితే ఈ మధ్య ఒక ఖరీదైన కారు కొన్నాడు రచ్చ రవి. అది చూసిన తర్వాత ఈయన రేంజ్ ఇంతగా ఉందా.. ఆయన అంత ఎదిగాడా అనే అనుమానాలు అందరిలోనూ వస్తున్నాయి.. జబర్దస్త్ మానేసిన తర్వాత రచ్చ రవికి సినిమాలు కూడా పెద్దగా రాలేదు.

అప్పుడప్పుడు హరీష్ శంకర్ సినిమాలు తప్ప ఈయన పెద్దగా కనిపించింది కూడా లేదు. మధ్యలో దిల్ రాజు కాంపౌండ్ లో కొన్ని సినిమాలు చేస్తున్నాడు. అయితే వీటి నుంచి ఆయన ఎంత సంపాదిస్తున్నాడు అంటే మాత్రం వచ్చేది మహా అయితే లక్ష రూపాయలు లేదంటే రెండు లక్షలు. అంతకంటే ఎక్కువ మాత్రం రాదు. ఇవి కాకుండా బయట కూడా పెద్దగా ఈవెంట్స్ ఏమీ చేయడం లేదు రచ్చ రవి. ఈ మధ్య కాలంలో ఏ కామెడీ షో లో కూడా కనిపించడం లేదు. మరి అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు ఇంత ఖరీదైన కారు ఎలా కొన్నాడు అనే విషయంపై అందరూ ఆరా తీస్తున్నారు. మొన్న దసరా పండుగ సందర్భంగా రచ్చ రవి నెక్సా గ్రాండ్ వింటారా కారును కొన్నాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రేక్షకులతో పంచుకున్నాడు రచ్చ రవి.

Racha Ravi car cost is too high

Racha Ravi car cost is too high

Racha Ravi : ఆ కారు ఎలా కొన్నాడబ్బా..

అంతేగాదు కారుతో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇన్ని సంవత్సరాల పాటు తనకు మద్దతుగా నిలిచి ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాడు ఈయన. మనోడు కొన్న కారుదల దాదాపు 20 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. ఒక సాధారణ కమెడియన్ ఇంత రేటు పెట్టి కారు కొన్నాడు అంటే ఏ రేంజ్ లో సంపాదించి ఉంటాడు అనే వాదన ఇప్పుడు మొదలైంది. ఇదంతా కేవలం జబర్దస్త్ కామెడీ షో నుంచి ఆయన సంపాదించాడా లేదంటే చేస్తున్న సినిమాలలో ఆయనకు ఎక్కువ పారితోషకం ఇస్తున్నారా.. ఈ రెండు కాకుండా వేరే ఏదైనా వర్క్ చేస్తున్నాడా అనేది అర్థం కావడం లేదు. ఒకటైతే నిజం.. ఈయన కొన్న కారు చాలా ఖరీదైంది. ఇది చూసి నెటిజన్లు ఆయనకు కంగ్రాట్స్ చెప్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp