Radhe Shyam : నోరు జారీ.. రాధే శ్యామ్ స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్.. బ్లాక్ బస్టర్ కాబోతున్న కథ ఇది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Radhe Shyam : నోరు జారీ.. రాధే శ్యామ్ స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్.. బ్లాక్ బస్టర్ కాబోతున్న కథ ఇది..!

Radhe Shyam : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న నాటి నుంచి చిత్రం బృందం రిలీజ్ చేస్తున్న ఒక్కో అప్డేట్ సినిమాపై భారీ హైప్ తీసుకు వచ్చేలా చేస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వచ్చిన సంచారి సాంగ్ టీజర్ కూడా అదిరిపోయింది. నార్త్, సౌత్.. ప్రేక్షకులను కలిపి ఆకట్టుకునేలా క్రియేట్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :15 December 2021,10:20 am

Radhe Shyam : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న నాటి నుంచి చిత్రం బృందం రిలీజ్ చేస్తున్న ఒక్కో అప్డేట్ సినిమాపై భారీ హైప్ తీసుకు వచ్చేలా చేస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వచ్చిన సంచారి సాంగ్ టీజర్ కూడా అదిరిపోయింది. నార్త్, సౌత్.. ప్రేక్షకులను కలిపి ఆకట్టుకునేలా క్రియేట్ చేసిన పాటలు అద్భుతంగా వచ్చాయి. విడుదలకు సరిగ్గా నెల రోజులు ఉండగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది.

ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు రాధకృష్ణ సినిమా స్టోరీ పై చేసిన పలు వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.డైరెక్టర్ రాధాకృష్ణ ఓ మీడియాతో ఈ మూవీ స్టోరీ లైన్ రివీల్ చేస్తూ సినిమా పట్ల ఉన్న ఆసక్తిని అమాంతం పెంచేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం… ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే రొమాన్స్ మాత్రమే కాదని… లైఫ్ అండ్ డెత్ మధ్య సాగే సెలబ్రేషన్‌గా చూపించబోతున్నట్లు ఆయన తెలిపారు. జీవితానికి, చావుకి మధ్య సెలబ్రేషన్ జరిగితే ఎలా ఉంటుందో… మూవీలో చూపించబోతున్నట్లు చెప్పారు. ఈ రోజుల్లో జాతకాలను నమ్మేవాళ్లతో పాటు వాటిని అస్సలు నమ్మని వాళ్లు కూడా ఉన్నారంటూ.. అయితే అందులో నిజమెంత? అబద్ధం ఎంత?

radhe shyaam movie story leaked by director radha krishna news went viral in social media

radhe shyaam movie story leaked by director radha krishna news went viral in social media

Radhe Shyam : ఇదే రాధే శ్యామ్ స్టోరీ..:

అనే దానికి ప్రేమ కథను యాడ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే మా సినిమా కథ అని చెప్పుకొచ్చారు. రాధాకృష్ణ లీక్ చేసిన ఈ స్టోరీ లైన్ ప్రస్తుతం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.మరిన్ని అంశాలపై ఓపెన్ అయిన దర్శకుడు… ఇక ఈ సినిమాకు వింటేజ్ లుక్‌తో పాటు యూరప్ బ్యాక్‌డ్రాప్ ఎంచుకోవాలనేది మాత్రం హీరో ప్రభాస్ ఆలోచనే అంటూ ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందన్నారు. అయితే సినిమా అనుకున్న 15 ఏళ్ల తర్వాత ఇది కార్యరూపం దాల్చడం వెనక ఓ ఆసక్తికరమైన అంశం దాగి ఉందన్నారు. అయితే అది ప్రస్తుతానికి సీక్రెట్ అని, త్వరలో ఆ విషయాన్ని వేదికపై రివిల్ చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రభాస్ సరసన, పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల అవ్వనుంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది