
radhe shyaam movie story leaked by director radha krishna news went viral in social media
Radhe Shyam : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షూటింగ్ పూర్తి చేసుకున్న నాటి నుంచి చిత్రం బృందం రిలీజ్ చేస్తున్న ఒక్కో అప్డేట్ సినిమాపై భారీ హైప్ తీసుకు వచ్చేలా చేస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వచ్చిన సంచారి సాంగ్ టీజర్ కూడా అదిరిపోయింది. నార్త్, సౌత్.. ప్రేక్షకులను కలిపి ఆకట్టుకునేలా క్రియేట్ చేసిన పాటలు అద్భుతంగా వచ్చాయి. విడుదలకు సరిగ్గా నెల రోజులు ఉండగా చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది.
ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు రాధకృష్ణ సినిమా స్టోరీ పై చేసిన పలు వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.డైరెక్టర్ రాధాకృష్ణ ఓ మీడియాతో ఈ మూవీ స్టోరీ లైన్ రివీల్ చేస్తూ సినిమా పట్ల ఉన్న ఆసక్తిని అమాంతం పెంచేశారు. ఇంటెన్స్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ చిత్రం… ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య నడిచే రొమాన్స్ మాత్రమే కాదని… లైఫ్ అండ్ డెత్ మధ్య సాగే సెలబ్రేషన్‌గా చూపించబోతున్నట్లు ఆయన తెలిపారు. జీవితానికి, చావుకి మధ్య సెలబ్రేషన్ జరిగితే ఎలా ఉంటుందో… మూవీలో చూపించబోతున్నట్లు చెప్పారు. ఈ రోజుల్లో జాతకాలను నమ్మేవాళ్లతో పాటు వాటిని అస్సలు నమ్మని వాళ్లు కూడా ఉన్నారంటూ.. అయితే అందులో నిజమెంత? అబద్ధం ఎంత?
radhe shyaam movie story leaked by director radha krishna news went viral in social media
అనే దానికి ప్రేమ కథను యాడ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనే మా సినిమా కథ అని చెప్పుకొచ్చారు. రాధాకృష్ణ లీక్ చేసిన ఈ స్టోరీ లైన్ ప్రస్తుతం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి.మరిన్ని అంశాలపై ఓపెన్ అయిన దర్శకుడు… ఇక ఈ సినిమాకు వింటేజ్ లుక్‌తో పాటు యూరప్ బ్యాక్‌డ్రాప్ ఎంచుకోవాలనేది మాత్రం హీరో ప్రభాస్ ఆలోచనే అంటూ ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందన్నారు. అయితే సినిమా అనుకున్న 15 ఏళ్ల తర్వాత ఇది కార్యరూపం దాల్చడం వెనక ఓ ఆసక్తికరమైన అంశం దాగి ఉందన్నారు. అయితే అది ప్రస్తుతానికి సీక్రెట్ అని, త్వరలో ఆ విషయాన్ని వేదికపై రివిల్ చేస్తానని చెప్పుకొచ్చారు. ప్రభాస్ సరసన, పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల అవ్వనుంది.
Gold Price on Jan 21 : అంతర్జాతీయ అనిశ్చితి - సురక్షిత పెట్టుబడిగా బంగారం ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న…
Karthika Deepam 2 Today Episode : కార్తీక దీపం 2 టుడే జనవరి 21 ఎపిసోడ్ నవ్వులు, భయాలు,…
Box Office 2026 : జనవరి 2026 సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా చరిత్రలో చెరగని ముద్ర వేసింది. కేవలం…
Home Remedies: చాలా మంది ఇళ్లలో బొద్దింకలు, దోమలు, ఈగలు, చీమలు వంటి కీటకాలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా…
Blue Berries : మార్కెట్‌లో మనకు అనేక రకాల పండ్లు సులభంగా దొరుకుతుంటాయి. అయితే వాటిలో కొన్ని పండ్లను మాత్రమే…
Zodiac Signs : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది కేవలం భవిష్యత్తును చెప్పడానికే…
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
This website uses cookies.