Radhika Apte : నా భర్త ఆ విషయంలో పనికిరాడు.. అస్సలు కోపరేట్ చేయడు.. రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్ వైరల్
Radhika Apte : రాధిక ఆప్టే తెలుసు కదా. తెలుగులో ధోనీ సినిమాతో తెర మీదికి వచ్చి ఆ తర్వాత వరుస ఆఫర్లు చేజిక్కించుకొని ఆ తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. ఏ సినిమాలో అయినా గ్లామర్ ఒలకబోయడంలో తన తర్వాతే ఎవరైనా. తను చాలా బోల్డ్ గా నటిస్తుంది. సినిమాల్లో అందాలను ఆరబోస్తుంది. అందుకే తనకు సోషల్ మీడియాలో కూడా తెగ ఫ్యాన్స్ ఉన్నారు. ఎవరు ఏమన్నా.. ఎంత నెగెటివ్ గా మాట్లాడినా రాధిక అస్సలు పట్టించుకోదు. తన గ్లామర్ షోను పెంచుతోంది తప్పితే తగ్గించదు.
అసలు సినిమాల్లో ఇంతగా రెచ్చిపోతోంది మరి తన వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు తనకు పెళ్లయిందో లేద కూడా చాలామందికి తెలియదు. కానీ.. తనకు పెళ్లి అయింది. చాలా ఏళ్ల క్రితమే తనకు పెళ్లి అయింది కానీ.. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలు కానీ.. తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఏ విషయాలను ఇప్పటి వరకు రాధిక ఎక్కడా షేర్ చేసుకోలేదు.కానీ.. ఇటీవల తన భర్తతో కలిసి వెళ్తున్న రాధిక ఆప్టే ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతే కాదు..

radhika apte comments on her husband about their personal life
Radhika Apte : రాధిక, తన భర్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన భర్తపై రాధిక షాకింగ్ కామెంట్స్ చేసింది. తన భర్త పేరు బెనెడిక్ట్. తను ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. తన భర్త మాత్రం ఎక్కడో విదేశాల్లో ఉంటాడు. మేము కలుసుకోవడం చాలా కష్టం. నా పని నాది. ఆయన పని ఆయనది. అసలు నా పర్సనల్ విషయాలను నేను పెద్దగా బయటికి చెప్పను. సోషల్ మీడియాలో కూడా షేర్ చేయను. నేనే ఇలా అంటే.. నా భర్త ఇంకా వేస్ట్. ఫోటోలు దిగుదాం అంటే అస్సలు దిగడు. అస్సలు కోపరేట్ చేయ్యడు. మా పెళ్లి అయి పదేళ్లు అయింది. కానీ.. మా మ్యారేజ్ ఫోటోలు కూడా లేవు. ఇక.. బయటికి వెళ్లినా పెద్దగా ఇద్దరం కలిసి ఫోటోలు దిగం.. అంటూ రాధిక షాకింగ్ విషయాలను ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.