Rahul RamaKrishna : కాబోయే భార్య‌కి లిప్‌ లాక్ ఇస్తూ, టీవీ9ని చెడుగుడు ఆడిన క‌మెడీయ‌న్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rahul RamaKrishna : కాబోయే భార్య‌కి లిప్‌ లాక్ ఇస్తూ, టీవీ9ని చెడుగుడు ఆడిన క‌మెడీయ‌న్

 Authored By sandeep | The Telugu News | Updated on :8 May 2022,6:30 pm

Rahul RamaKrishna : టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన కామెడీ చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రించిన న‌టుడు రాహుల్ రామ‌కృష్ణ‌. ఆయ‌న‌ రచయితగా కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. అంతేకాకుండా పాటల రచయితగా కూడా కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు. అయితే అతను ఇటీవల సోషల్ మీడియాలో విభిన్నమైన శైలిలో కాంట్రవర్సీ విషయాలపై కూడా స్పందిస్తున్నారు . పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన సైన్మా అనే షార్ట్ ఫిలిం ద్వారా బాగా క్రేజ్ అందుకున్న రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తో ఒక కమెడియన్ గా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

అయితే అతను కేవలం కమెడియన్ పాత్రలు మాత్రమే కాకుండా విభిన్నమైన క్యారెక్టర్స్ లో కూడా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే ఇటీవల కాలంలో రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియాలో ఎవరు ఊహించని విధంగా ట్వీట్స్ వేస్తూ ఉండడం విశేషం. ఎక్కువగా కాంట్రవర్సీ విషయాలపై కూడా రాహుల్ రామకృష్ణ చాలా ఓపెన్ గా కౌంటర్లు వేస్తున్నాడు. ఇటీవల ప్రముఖ మీడియా అలాగే విశ్వక్సేన్ కు మధ్య జరిగిన వివాదంపై కూడా రాహుల్ రామకృష్ణ హీరోకు మద్దతు ఇచ్చాడు. కావాలంటే నేను కూడా డిబేట్ కి వస్తాను అంటూ ఛాలెంజ్ కూడా విసిరాడు.

rahul rama krishna satires on tv9

rahul rama krishna satires on tv9

Rahul RamaKrishna : పెళ్లి విష‌యం చెప్పాడుగా..

తాజాగా రాహుల్ రామకృష్ణ తన ఫియాన్సీతో ఉన్న ఫోటో విషయంలో కూడా ఆ చానల్ పై సెటైర్లు వేశాడు.ఈ ఫోటోపై మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు డిబేట్ పెట్టండి. నేను నా ఫియాన్సీ తప్పకుండా డిబేట్ కి వస్తాం.. మీరు ఇలాంటివి చేస్తారు కదా అంటూ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ రామ‌కృష్ణ ఆ ఛానెల్‌పై అంత చెల‌రేగిపోవ‌డానికి కార‌ణం ఏమై ఉంటుందా అని ప్ర‌తి ఒక్క‌రు చ‌ర్చించుకుంటున్నారు. కాగా, విశ్వక్ సేన్, యాంకర్ దేవి నాగవల్లి వివాదం టాలీవుడ్ లో సంచలనంగా మారింది. విశ్వక్ సేన్ తన చిత్రం అశోక వనంలో అర్జున కళ్యాణం కోసం ఫ్రాంక్ వీడియో చేశాడు. దీనిపై ఆ ఛానల్ లో జరిగిన డిబేట్ లో విశ్వక్ సేన్, నాగవల్లి మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది