రాహుల్ సిప్లిగంజ్ ప్రతీసారి ఓ మాట చెబుతుంటాడు. తెలుగులో ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ క్రియేట్ చేయడంలో ముందుంటాను.. మన రేంజ్‌ను పెంచాలనే ఉద్దేశ్యంతోనే ప్రైవేట్ ఆల్బమ్స్‌ను చేస్తుంటాను.. దాంట్లో నాకు ఒక్క రూపాయి కూడా రాదు..పైగా నేను అప్పులు చేసి మరీ ఆల్బమ్స్‌ను క్రియేట్ చేస్తాను అని రాహుల్ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. చివరకు తన అమ్మ గాజులు, పుస్తెలు అమ్మి కూడా ఆల్బమ్స్ చేశానని తెలిపాడు.
ఈ మధ్యే బేబీ ఆల్బంకు ఎంతలా కష్టపడ్డాడో కూడా చెప్పాడు. బేబీ ఆల్బంకు అనుకున్న బడ్జెట్ మించిపోయిందని దాదాపు యాభై లక్షల్లో తీసేద్దామని అనుకుంటే అది ఎక్కడికో వెళ్లిపోయింది.. అసలు ఆ బడ్జెట్‌తో ఓ సినిమా కూడా తీసేయొచ్చు. కానీ బేబీ ఆల్బంను అంత గ్రాండ్‌గా తీసినా అందులోనూ నష్టాలే వచ్చాయి.. అప్పులే చేశాను అంటూ రాహుల్ చెప్పుకొచ్చాడు. తాజాగా రాహుల్ సుమ నిర్వహిస్తోన్న కొత్త షోలో గెస్ట్‌గా వచ్చాడు. అక్కడా కూడా ఇదే విషయాన్ని చెప్పాడు.
సుమ ఈ మధ్య బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అంటూ ఓ కొత్త షోతో మన ముందుకు రాబోతోన్న సంగతి తెలిసిందే. అందులో మొదటి ఎపిసోడ్‌లో రాహుల్, కౌశల్ ఇద్దరూ గెస్ట్‌లుగా వచ్చారు. అలా అందులో సుమ రాహుల్‌ను ఓ ప్రశ్న అడిగింది. నీ లైఫ్‌లో బిగ్గెస్ట్ చాలెంజ్ ఏంటని ప్రశ్నించింది. ఆల్బమ్స్ కోసం అప్పులు చేయడం.. వాటిని తీర్చడం అంటూ సింపుల్‌గా తన కష్టాలను ఒక్క మాటలో చెప్పేశాడు. మొత్తానికి రాహుల్ ఆల్బమ్స్ క్రియేట్ చేయడానికి ఆర్థికంగా ఎంత కష్టపడుతున్నాడో అందరికీ తెలిసేలానే చెప్పేశాడు.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.