Hyper Aadi : రైజింగ్ రాజుకు ఏమైంది?.. జబర్దస్త్‌లో మళ్లీ అలా!

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 3 September 2021, 7:30 pm

Hyper Aadi హైపర్ ఆది టీం పేరులోనే రైజింగ్ రాజు పేరు కూడా ఉంటుంది. మొదటి నుంచి కూడా హైపర్ ఆది రైజింగ్ రాజు టీం అనే ఉంటుంది. అంతా చేసేది ఆది అయినా కూడా మొదటి నుంచి ఉన్నందున రైజింగ్ రాజుకు కూడా పేరులో భాగమిచ్చేశాడు ఆది. అలా రాజు ఉన్నా లేకపోయినా కూడా టీం పేరులో మాత్రం రైజింగ్ రాజు అని ఉంటుంది. ఈ మధ్య రాజు జబర్దస్త్ షోలో కనిపించడం లేదు. గత కొన్ని నెలల నుంచి రాజు షూటింగ్‌లకు దూరంగా ఉన్నట్టు కనిపిస్తోంది.

Raising Raju Again In Hyper Aadi Team

Raising Raju Again In Hyper Aadi Team

రైజింగ్ రాజుకు ఏమైంది?.. జబర్దస్త్‌లో మళ్లీ అలా! Hyper Aadi

మధ్య మధ్యలో రాజు ఇలా జబర్దస్త్ షోలో కనిపించరు. ఆయనకు ఆరోగ్య సమస్యలున్నాయన్న సంగతి తెలిసిందే. అందుకే అలా గ్యాప్ ఇస్తూ కనిపిస్తుంటాడు. రాజు ఆరోగ్య సమస్యల మీదా ఆది కౌంటర్లు వేస్తుంటాడు. ఆయనకు కిడ్నీల సమస్య ఉన్నట్టు తెలుస్తోంది. అయితే చాలా రోజుల తరువాత రాజు మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా వదిలిన ప్రోమోలో రాజు కనిపించాడు. వచ్చే వారం నుంచి రాజు మళ్లీ ఆది టీంలో సందడి చేయనున్నాడు.

 

Raising Raju Again In Hyper Aadi Team

Raising Raju Again In Hyper Aadi Team

రాజు, పరదేశీ, దొరబాబు, శాంతి స్వరూప్‌లో ఆది పుట్టించే కామెడీ మామూలుగా ఉండదు. వచ్చే వారం రాజు, రాజ్యం అనే స్కిట్ వేశాడు ఆది. అందులో ఆది.. మహారాజులా వేషం వేశాడు. రాజు ఎంట్రీ ఇవ్వడంతో.. ఇన్నెళ్లు ఎక్కడికి పోయావ్ అని అడుగుతాడు. పక్క రాజ్యం మీదకు దండెత్తడానికి వెళ్లాను అని రాజు చెబుతాడు. అది మాకు తెలియక నీ కోసం దండలు పట్టుకుని తిరిగామని కౌంటర్ వేశాడు. అంతే రాజు పోయి ఉంటాడనే ఉద్దేశ్యంలో ఆది ఆ కౌంటర్ వేసేశాడు.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp