Raja Saab : జపాన్ లో ప్రభాస్ రాజా సాబ్ ఆడియో రిలీజ్.. రెబల్ స్టారా మజాకా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Raja Saab : జపాన్ లో ప్రభాస్ రాజా సాబ్ ఆడియో రిలీజ్.. రెబల్ స్టారా మజాకా..!

 Authored By ramesh | The Telugu News | Updated on :8 January 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Raja Saab : జపాన్ లో ప్రభాస్ రాజా సాబ్ ఆడియో రిలీజ్.. రెబల్ స్టారా మజాకా..!

Raja Saab : ప్రభాస్ రాజా సాబ్ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని రెబల్ స్టార్ Prabhas ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహంగా ఉన్నారు. ఐతే రాజా సాబ్ గురించి ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాత్రం లెక్కకు మించి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాడు. ముఖ్యంగా రాజా సాబ్ సినిమాను కేవలం ఇండియన్ భాషల్లోనే కాదు ఈసారి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.పాన్ ఇండియా లెవెల్ లో సినిమా రిలీజై ఇక్కడ హిట్ అయ్యాక జపాన్, చైనాల్లో మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఐతే ప్రభాస్ రాజా సాబ్ Raja Saab మేకర్స్ ఈసారి అక్కడే డైరెక్ట్ గా రిలీజ్ చేసేలా ప్లన్ చేస్తున్నారు. దీనికి సంబందించిన అప్డేట్ లేటెస్ట్ గా థమన్ ఇచ్చాడు. రాజా సాబ్ అప్డేట్స్ లేట్ అవొచ్చు కానీ సినిమా అదిరిపోతుంది. జపాన్ లో సినిమా ఆడియో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు…

Raja Saab జపాన్ లో ప్రభాస్ రాజా సాబ్ ఆడియో రిలీజ్ రెబల్ స్టారా మజాకా

Raja Saab : జపాన్ లో ప్రభాస్ రాజా సాబ్ ఆడియో రిలీజ్.. రెబల్ స్టారా మజాకా..!

Raja Saab ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేసినా..

ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమా విషయంలో మేకర్స్ ప్లానింగ్ లో నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఈ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అసలైతే ఏప్రిల్ 10న రిలీజ్ లాక్ చేసినా సినిమా అనుకున్న టైం కు తీసుకు రావడం కష్టమే అనేలా ఉంది.

ప్రభాస్ రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్ Malavika Mohanan హీరోయిన్ గా నటిస్తుండగా నిధి అగర్వాల్ కూడా నటిస్తుంది. సినిమాకు థమన్ Thaman మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఉండబోతుందని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది. సినిమా ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి. ప్రభాస్ లైన్ లో స్పిరిట్, ఫౌజి సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఆ రెండు సినిమాలు కూడా భారీ అంచనాలతో రాబోతున్నాయి. రాజా సాబ్ సినిమా విషయంలో యూనిట్ ప్లానింగ్ అంతా ఒక రేంజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. Prabhas, Raja Saab, Rebal Star Prabhas, Thaman, Malavika Mohanan

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది