Rajamouli : ఆస్కార్ వచ్చిన ఆనందంలో రాజమౌళి భారీ ప్రకటన.. ప్రపంచం బిత్తరపోయే సినిమా చేయబోతున్నాడు !

Authored By Breaking News | The Telugu News | Updated on : 14 March 2023, 8:40 pm

Rajamouli : దిగ్గజ దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతుంది. “ఆర్ఆర్ఆర్” సినిమా ఆస్కార్ గెలవడంతో జక్కన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అవతార్ వంటి భారీ సినిమాలు తీసిన గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళితో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మీడియా ముందు చెప్పుకొచ్చారు. RRR సినిమాతో రాజమౌళి ప్రపంచ సినిమా దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేశారు. RRR కంటే బాహుబలి పెద్ద హిట్ అవ్వటం మాత్రమే కాదు కలెక్షన్లు కూడా ఎక్కువ సాధించింది. కానీ RRR సినిమా అంతర్జాతీయంగా రాజమౌళికి మంచి పేరు తీసుకొచ్చింది.

Rajamouli big announcement in the joy of getting oscar

Rajamouli big announcement in the joy of getting oscar

ఈ క్రమంలో ఆస్కార్ రావటంతో రాజమౌళి ఫుల్ ఆనందంగా ఉన్నారు. త్వరలోనే RRR సినిమా యూనిట్ కి గ్రాండ్ పార్టీ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ పార్టీలో ఆస్కార్ వచ్చిన ఆనందంతో ప్రపంచం మొత్తం బిత్తరపోయేలా కీలక ప్రాజెక్టు జక్కన్న ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. అయితే ఈ సినిమా అయినా వెంటనే

Oscars 2023: RRR Actors Ram Charan, Jr NTR, SS Rajamouli Take Indian Ethnic  Fashion To The Academy, See PICS - Filmibeat

“బాహుబలి 3” రాజమౌళి స్టార్ట్ చేయబోతున్నట్లు మొన్నటి వరకు ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ టాక్ “RRR 2” ముందుగా మొదలు పెట్టాలని రాజమౌళి స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. RRR సినిమాకి సంబంధించి విదేశాలలో అవార్డుల వేడుకలలో ఆస్కార్ ప్రమోషన్ కార్యక్రమాలలో సెకండ్ పార్ట్ చేయబోతున్నట్లు రాజమౌళి తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆస్కార్ వచ్చిన ఆనందంతో సినిమా యూనిట్ కి… పార్టీ ఇచ్చి “RRR 2” ప్రాజెక్టుకు సంబంధించి కీలక ప్రకటన రాజమౌళి చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

Advertisement

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి