Mahesh Babu : మ‌ల్టీ స్టార‌ర్ సినిమాగా మ‌హేష్ బాబు సినిమా ప్లాన్ చేస్తున్న రాజ‌మౌళి

Authored By Sam C | The Telugu News | Updated on : 15 February 2022, 3:30 pm

Mahesh Babu : హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇటీవ‌లి కాలంలో త‌న సినిమాల కోసం ఏళ్ల‌కు ఏళ్లు టైం స్పెంట్ చేస్తున్నాడు. భారీ బ‌డ్జెట్‌తో అత్య‌ద్భుత‌మైన చిత్రాలు చేస్తూ తెలుగోడు కాల‌ర్ ఎత్తుకునేలా చేస్తున్నాడు. బాహుబ‌లి సినిమాతో త‌న స‌త్తా ఏంటో చూపిన రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈమూవీ మార్చి 25న విడుద‌లకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్‌తో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు రాజ‌మౌళి. ఇప్ప‌టికే దీనికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. అయితే ఇటీవ‌లి కాలంలో ఈ సినిమాకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

తాజాగా మ‌హేష్ – రాజ‌మౌళిల సినిమా ఓ మ‌ల్టీస్టార‌ర్ అని ఇందులో మ‌రో అగ్ర హీరోకూడా న‌టించ‌బోతున్నాడు అని ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ సినిమాలో 40 నిమిషాల వ్య‌వ‌ధిగ‌ల ఓ కీల‌క‌మైన ఎపిసోడ్ ఉంది. ఆ ఎపిసోడ్ కోసం ఓ పెద్ద హీరో కావాలి. అందుకోసం ఓ టాలీవుడ్ స్టార్‌నే ఎంచుకోవాల‌ని చూస్తున్నాడ‌ట‌.`ఆర్‌.ఆర్‌.ఆర్‌`లో ఇద్ద‌రూ తెలుగు హీరోలే అయిన‌ప్ప‌టికీ భారీ బిజినెస్ జ‌రిగింది. ఇప్పుడు ఈ సినిమా కోసం తెలుగు హీరోనే దించే ప్ర‌య‌త్నంలో ఉన్నాడ‌ట‌. అయితే ఆ హీరోతో 40 నిమిషాల పాటు సాగే ఆ ఎపిసోడ్ మాత్రం అదిరిపోయే స్థాయిలో డిజైన్ చేయ‌బోతున్నార‌ట‌.

rajamouli big plan with mahesh babu

rajamouli big plan with mahesh babu

Mahesh Babu : రాజ‌మౌళి ప్లానింగ్ అదుర్స్..

ప్రస్తుతం మహేశ్ బాబు – రాజమౌళి సినిమాకు సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి. ఇక ఈ సినిమాలో విల‌న్‌గా గోపిచంద్‌ని తీసుకోబోతున్న‌ట్టు చ‌ర్చ న‌డుస్తుంది. గతంలో వర్షం సినిమాలో కూడా గోపీచంద్ విలన్‌‌గా చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ అనే మూవీని చేస్తున్నాడు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. హీరోగా చేస్తున్నా కూడా కొంద‌రు విల‌న్‌గా అల‌రిస్తున్నారు. ఇప్పుడు గోపిచంద్‌తో కూడా మిరాకిల్ చేయాల‌ని రాజమౌళి భావిస్తున్నాడ‌ట‌.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp