Home » Entertainment » Rajamouli Givemovie With Balakrishna In Unstoppable With Nbk Shows Clarity
Entertainment

Unstoppable : బాలకృష్ణ అంటే తనకు భయమన్న రాజమౌళి.. బాబుతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన దర్శకధీరుడు..!

Authored By
Breaking News 2
The Telugu News | Published on: December 19, 2021, 7:40 pm
Advertisement

Unstoppable : నంద‌మూరి బాలకృష్ణ అటు అఖండ భారీ విజయంతో సంతోషంలో మునిగి తేలుతూనే మరోవైపు ఓటీటీ ఆహాలో తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే టాక్ షోతో ఖాళీ లేకుండా గడుపుతున్నారు. ఈ కార్యక్రమం రోజురోజుకు అద్భుతమైన రికార్డులను సృష్టిస్తూ.. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటివరకు వచ్చిన 4 ఏపిసొడ్ లు అభిమానులను ఎంతగానో అలరించగా… తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి, సంగీత బ్రహ్మ కీరవాణిలతో వస్తున్న ఏపిసొడ్ 5 ప్రోమో విడుదల అయింది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రోమో… ఇప్పుడు పూర్తి ఏపిసొడ్ పై భారీ అంచనాలను నెలకొల్పుతోంది.అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీ కే టాక్ షో నుంచి తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో బాలకృష్ణ రాజమౌళి నడుమ జరిగిన సరదా సంభాషణ షో కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

షో లో భాగంగా హోస్ట్ బాల‌య్య… రాజమౌళిని తన ప్రశ్నలతో ఇరకాటంలో పడేలా చేశారు. మన‌ ఇద్దిరి కాంబినేష‌న్‌లో ఇంతవరకు సినిమా రాలేదు క‌దా… నా అభిమానులు మిమ్మ‌ల్ని బాల‌య్య‌తో ఎప్పుడు సినిమా చేస్తార‌ని ప్రశ్నిస్తే… బాలకృష్ణను హ్యాండిల్‌ చేయడం నా వల్ల కాదు అన్నారట ఎందుకు? అని ప్రశ్నించారు. దీనిపై రాజమౌళి స్పందింస్తూ… అవును భయంతోనే అలా అన్నానని మనసులో మాట బయట పెట్టేశారు. తాను షూట్ చేస్తుంటే బాలకృష్ణ కేమైనా కోపం వస్తుందేమోనని తన భయం అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చారు. మాటల్లో మాట కలుపుతూ అసలు బాలకృష్ణ కి భయమనేదే ఉండదేమొనన్న రాజమౌళి.. అసలు భయానికి బాలయ్యకు సంబంధమే లేదంటూ నవ్వించారు.

rajamouli givemovie with Balakrishna in Unstoppable with NBK shows clarity

Advertisement

Unstoppable : బాలకృష్ణతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..!

అయితే తనకు కోపం చాలా ఎక్కువేనంటూ చెప్పుకొచ్చిన బాలయ్య.. ఓ సినిమా షూట్ లో తనకు బాగా కోపం తెప్పించిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు.షో కు హాజరైన మరో గెస్ట్ సంగీత దర్శకుడు కీరవాణి గురించి సంబోధిస్తూ.. సంగీతంలో దిట్ట మీరు అని బాలయ్య అన్నారు. అందుకు బదులుగా.. కీరవాణి తను దిట్టను కాదని గుట్టనని చెప్పేసరికి అక్కడ ఉన్న ఆడియన్స్ అంత ఒక్కసారిగా నవ్వారు. ఇలా వీరి ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ప్రోమోనే ఇలా ఉంటే.. ఇంకా పూర్తి ఏపిసొడ్ లో వీరు చేసే రచ్చ మామూలుగా ఉండదని అర్థం అవుతోంది. ఇక పూర్తి ఎపిసోడ్ లో వీరి మధ్య ఏం సంభాషణ జరిగిందో..? బాలయ్య రాజమౌళిని ఇంకా ఏం ఏం ప్రశ్నలు అడిగారో అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.

Breaking News 2

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి