Home » Entertainment » Rajamouli Gives Clarity About Multi Starrer
Entertainment

Rajamouli : మహేష్ మూవీలో బాల‌కృష్ణ ఉన్న‌ట్టా, లేన‌ట్టా.. క్లారిటీ ఇచ్చిన రాజ‌మౌళి

Authored By
Sam C
The Telugu News | Updated on: March 20, 2022 12:26 pm
Advertisement

Rajamouli : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉండ‌గా, ఆయ‌న త‌దుప‌రి చిత్రం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. అక్కడ గుమ్మడికాయ కొట్టగానే గురూజీ క్యాంప్‌లో చేరిపోతారు. ఆ తర్వాతే జక్కన్న-మహేష్‌ కాంబో అనేది రియాలిటీలోకొచ్చేది. ఆప్రాజెక్ట్‌లోనే బాలయ్యను చేర్చార‌న్న‌ది కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం. ఒక సీనియర్ హీరోతో జతకట్టి బ్లాక్‌బస్టర్ కొట్టిన మహేష్‌తో అదే సెంటిమెంట్‌ని కంటిన్యూ చేస్తున్నారట దర్శకధీరుడు. కానీ… ఈసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాదు.. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచరస్ స్టోరీతో ఈ మల్టిస్టారర్‌ రాబోతోంది. సినిమా ఆసాంతం నడిచేలా 40 నిమిషాల లెంత్ వుండే బలమైన క్యారెక్టర్‌ని బాలయ్య కోసం రాసిపెట్టారని అన్నారు.

Advertisement

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న విడుద‌ల కానుండ‌గా,ఈ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో రాజ‌మౌళిని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు. అయితే తన నెక్ట్స్ మూవీ మ‌ల్టీస్టార‌ర్ అని వ‌స్తోన్న వార్త‌ల్లో నిజం లేద‌ని.. మ‌హేష్ బాబు మాత్ర‌మే త‌న త‌దుప‌రి సినిమాలో హీరోగా క‌నిపించ‌బోతున్నారర‌ని ఆయ‌న క్లారిటీ ఇచ్చేశారు. దీంతో బాల‌కృష్ణ‌- మ‌హేష్ మ‌ల్టీ స్టార‌ర్‌పై అభిమానుల‌లో ఓ క్లారిటీ వ‌చ్చింది. మ‌హేష-రాజ‌మౌళి చిత్రం సోలో హీరో నేప‌థ్యంలో సాగ‌నుంద‌ని తెలుస్తుంది.

rajamouli gives clarity about multi starrer

Advertisement

Rajamouli : మ‌ల్టీ స్టార‌ర్‌పై క్లారిటీ..

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా అంటే దాదాపు ఏడాదిన్న‌ర నుంచి రెండేళ్ల వ‌ర‌కు మ‌రో సినిమాకు క‌మిట్ అయ్యే అవ‌కాశం ఉండ‌దు. కాబ‌ట్టి మ‌హేష్‌.. జ‌క్క‌న్న సినిమాను స్టార్ట్ చేయ‌డాని కంటే ముందే, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాను పూర్తి చేస్తారు. ఈ సినిమాని కూడా వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని మ‌హేష్ ప్లాన్. చివ‌రిగా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన మ‌హేష్ ఇప్పుడు స‌ర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక రాజ‌మౌళి విష‌యానికి వ‌స్తే..ఆర్ఆర్ఆర్ త‌ర్వాత పూర్తి స్థాయిలో మ‌హేష్ క‌థ‌పై కూర్చుంటాన‌ని ఆయ‌న రీసెంట్‌గా చెప్పారు. మ‌హేష్ కోసం కొన్ని పాయింట్స్‌ను అనుకున్నామ‌ని, దానిపై క‌థ‌ను వ‌ర్క‌వుట్ చేయాల‌ని జ‌క్క‌న్న క్లారిటీ ఇచ్చేసిన సంగ‌తి తెలిసిందే.

 

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి