Health Benefits your cholesterol levels can be reduced by drinking hot water
Health Benefits : రోజూ నీళ్లు తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుందనే విషయం తెలిసిందే. అయితే, కొందరు చిల్డ్ వాటర్‌ను సీసాల కొద్ది తాగేస్తుంటారు. దీనివల్ల ఉన్న ఆరోగ్యం కూడా చెడిపోతుంది. కాబట్టి గోరువెచ్చని నీళ్లు తాగడమే ఉత్తమం. ఉరుకుల పరుగుల జీవితంలో చిన్న చిన్న అశ్రద్ధల వల్ల అనారోగ్యం బారిన పడుతున్నమన్న విషయాన్ని అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు ఉదయాన్నే పరిగడుపున వేడి నీళ్లు తాగితే ఎంతో మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ఉదయం నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకోడానికి ముందే రెండు లేదా మూడు గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగాలి.
ఇలా చేస్తే పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, అజీర్తి, జీర్ణ సమస్యలు, ఉదర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. రక్త ప్రసరణ కూడా సక్రమంగా జరుగుతుంది. మూత్ర సంబంధిత వ్యాధులు కూడా తగ్గిపోతాయి.రోజూ రెండు నుంచి మూడు గ్లాసుల నీరు తాగితే ముఖ్యంగా ఊబకాయం, అధిక బరువు వంటి సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. వేడి నీరు తాగడం వల్ల కొవ్వు కరగడంతోపాటు.. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు.
Health Benefits in drink hot water
వేడి నీళ్లు రక్త ప్రసరణ పెంచడంతోపాటు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవి కాలంలో సైతం డిహైడ్రేడ్ సమస్య తీర్చేందుకు వేడి నీరు ఉపయోగపడుతుంది. గొంతు సమస్యలు దరి చేరువు. జలుబు, న్యూమోనియా నుంచి దూరంగా ఉంచుతుంది. అయితే ఈ వేడి నీటిలో మార్నింగ్ టైంలో నిమ్మరసం, తేనె, అల్లం లాంటివి కలిపి తాగితే ఇంకా మంచిదని సూచిస్తున్నారు.అయితే నీటిని ఒక్కసారిగా గొంతులో వేసుకోని మింగేయకుండా నోటిలోనే ఉంచుకుంటూ నెమ్మదిగా గుటకలు వేస్తూ మింగాలి. ఇలా రోజూ చేస్తే చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూడవచ్చు. పురుషులు 3.7 లీటర్లు, స్త్రీలు 2.6 లీటర్లు చొప్పున తాగడం మంచిది.
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్‌లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
This website uses cookies.