Pawan Kalyan : త్రివిక్రమ్‌తో వారు.. పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి.. అది జరిగే పనేనా?
Pawan Kalyan : భీమ్లా నాయక్ సినిమా అందరికీ ఇప్పుడు కొరకరాని కొయ్యగా మారింది. అసలే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియన్ సినిమాలు సంక్రాంతి బరిలోకి వచ్చాయి. వీటికంటే ముందే భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలోకి దిగుతానని ప్రకటించాడు. ఆ తరువాతే ఆర్ఆర్ఆర్ రంగంలోకి దిగింది. దీంతో అసలు చిక్కు వచ్చి పడింది. ఈ మూడు సినిమాలు వస్తే థియేటర్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇక మరో వైపు ఏపీలో టిక్కెట్ల రేట్లు కూడా దెబ్బ కొట్టేసింది.
దీంతో పెద్ద ఎత్తున సినిమాలను విడుదల చేయాలని చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా జనవరి 7న రాబోతోంది.. భీమ్లా నాయక్ జనవరి 12న రాబోతోంది. అయితే భీమ్లా నాయక్ వస్తే.. సమస్య ఏర్పడుతుందని డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన చెందుతున్నారట. ఈ మేరకు ఇది వరకే నిర్మాతల మీద ఒత్తిడి తీసుకొచ్చారట. కానీ నాగ వంశీ మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గడం లేదట. ఇక పవన్ కళ్యాణ్ కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, ఇంత వరకు వచ్చాక వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదని అన్నాడట.

Rajamouli Meet With Pawan Kalyan About Bheemla Nayak
Pawan Kalyan : భీమ్లా నాయక్ తగ్గుతాడా?
కానీ పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి వ్యక్తిగతం భేటీ అవుతున్నాడట. భీమ్లా నాయక్‌ను వాయిదా వేయాలని కోరబోతోన్నాడట. మరో వైపు దానయ్య, దిల్ రాజు, యూవీ క్రియేషన్స్ అందరూ కలిసి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్తారట. పవన్ కళ్యాణ్‌కు కాస్త నచ్చజెప్పండని, భీమ్లా నాయక్‌ను వాయిదా వేయండని కోరబోతోన్నారట. కానీ త్రివిక్రమ్ విన్నా కూడా పవన్ కళ్యాణ్ కన్సిడర్ చేస్తాడా? వెనక్కి తగ్గుతాడా? అన్నది చూడాలి. అసలే ఇండస్ట్రీ మీద పవన్ కళ్యాణ్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.