Rajanikanth : రజినికాంత్ రేలంగి మామయ్య గా చేయాల్సిందా,. ఆ ఒక్క డైలాగ్ కి ఫిదా అయ్యాడా..!
Rajanikanth : వెంకటేష్ మహేష్ కలిసి చేసిన మల్టీస్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చింది. ఐతే ఈ సినిమాలో రేలంగి మామయ్య పాత్రలో ప్రకాష్ రాజ్ అదరగొట్టారు. మనిషంటేనే మంచి అనే విధంగా సినిమా అంతా తన మంచి తనంతో మురిపిస్తాడు. ఐతే ఈ సినిమాలో ఆ పాత్రకు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల సూపర్ స్టార్ రజినీకాంత్ ని అనుకున్నారట. ఏంటి రేలంగి మామయ్య పాత్రకి రజినీనా అనుకోవచ్చు.శ్రీకాంత్ అడ్డాల డేర్ చేసి రజినీని కలిసి ఈ సినిమా కథ చెప్పారట. ఐతే కథ నచ్చిన రజినీ ఈ పాత్రకు తానే ఎందుకు అని అడిగారత. ఐతే ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్ మనిషి అంటేనే మంచి అనుకుంటూ ఎదుటి వారిని నవుతూ పలకరించే పాత్ర మీరు చేస్తే బాగుంటుందని అన్నాడట. అలా చెప్పగానే రజినీ ఈ సినిమా చేయాలని ఉంది కానీ హెల్త్ సహకరించట్లేదని అన్నారట.
Rajanikanth : రజినికాంత్ రేలంగి మామయ్య గా చేయాల్సిందా,. ఆ ఒక్క డైలాగ్ కి ఫిదా అయ్యాడా..!
ఇక ఇక్కడ హీరోల డేట్స్ అయిపోతుండటం వల్ల ప్రకాష్ రాజ్ తో ఆ పాత్ర కానిచ్చేశామని అన్నారు. ఒకవేల రజినీ ఆ పాత్ర చేసి ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. పెదరాయుడు సినిమాలో కెమియో లో మెప్పించిన రజిని తెలుగు స్ట్రైట్ సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్నా సరైన కథ దొరకట్లేదు. రజినీకాంత్ రేలంగి మామయ్యగా చేసి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భలే అనిపిస్తుంది.
ముఖ్యంగా వెంకటేష్, మహేష్ నటించిన ఈ సినిమాలో రజినీకాంత్ కూడా ఉంటే ఆ లెక్క వేరేలా ఉండేది. మొత్తానికి రజినీ మిస్సైన రేలంగి మామయ్య పాత్రలో ప్రకాష్ రాజ్ అభినయం ఇప్పటికీ ఆ పాత్రని ప్రేక్షకులు గుర్తుంచుకునేలా చేసిందని చెప్పొచ్చు. నిజంగానే రజినీ ఆ సినిమా ఒప్పుకుని ఉంటే మాత్రం కచ్చితంగా మరో క్లాసిక్ గా ఉండేది. ఐతే అది మిస్ అయినందుకు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. Rajanikanth, SVSC, Mahesh Babu, Venkatesh, Srikanth Addala
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్‌డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
This website uses cookies.