Maha Shivaratri : బిల్వపత్రం శివునికి ఎందుకు ఇష్టం...? అసలు వీటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి..?
Maha Shivaratri : మన తెలుగు సాంప్రదాయాలలో మహాశివరాత్రి పండుగ హిందూ ధర్మంలో ముఖ్యమైన పండుగ. ఈ మహాశివరాత్రి రోజున భక్తులు విశేషంగా శివునికి భక్తితో పూజలు చేస్తారు. ఇంకా శివయ్యకు వివిధ రకాల సమర్పణలు కూడా చేస్తారు. అందులో ముఖ్యమైనది మారేడు ఆకులు ( బిల్వపత్రాలు) శివుని పూజలో విటికీ ప్రత్యేక స్థానం ఉంది. ఇంకా శివునికి ఎంతో ప్రీతికరమైన పత్రాలు. అయితే పురాణాలు తెలిపేది ఏమిటంటే మారేడు ఆకులను సమర్పించడం శుభప్రదం అని, పాపా విమోచనానికి దారితీస్తుందని నమ్ముతారు. మన హిందూ ధర్మంలో మారేడు వృక్షం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దీనికి గల పవిత్రత కారణంగా శివుని పూజలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆకులు బత్తిని సూచిస్తాయి మరియు శివుడు వాటిని ఎంతో ప్రీతితో స్వీకరిస్తాడని ఏ భక్తులు ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతారు.
Maha Shivaratri : బిల్వపత్రం శివునికి ఎందుకు ఇష్టం…? అసలు వీటి గురించి పురాణాలు ఏం చెబుతున్నాయి..?
బిల్వపత్రమునకు ఆ పేరు మూడు ఆకులను కలిగి ఉండడం వలన బిల్వపత్రం లేదా త్రీఫల పత్రం అని కూడా అంటారు. ఈ మూడు ఆకులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయని హిందూ ధర్మం చెబుతుంది. ఈ సమతుల్యత శివుని అనుగ్రహం పొందేందుకు సహాయపడుతుందని భక్తులు విశ్వాసం.
లక్ష్మీదేవి, మారేడు వృక్షం : పురాణాలలో, స్కంద పురాణం, శివపురాణం వంటి ప్రాచీన గ్రంధాలు మారేడు ఆకులు ప్రాముఖ్యతను సూచిస్తుంది. భక్తితో సమర్పించిన ఒక్క బిల్వపత్రం కూడా అపారమైన శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతున్నాయి పురాణాలు. శివునికి ఏది లేకపోయినా ఒక్క మారేడు పత్రం సమర్పించినా చాలు శివయ్య కటాక్షంతో విశేష ఫలితాలను భక్తులకు ఇస్తాడు అని పురాణాలు తెలియజేస్తున్నాయి.
ఆధ్యాత్మిక శక్తి : ఈ త్రిఫల పత్రాలు ఆధ్యాత్మిక శక్తిని మన జీవితంలో ప్రతికూలశక్తులను కూడా తొలగిస్తుందని నమ్ముతారు. వీటిని సమర్పించడం వల్ల పాప క్షయానికి దారితీస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ బిల్వపత్రాలు సమర్పించడం వల్ల భక్తులకు మోక్షమార్గం సులభం అవుతుందని విశ్వసిస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలు : మరి ఆరోగ్యపరంగా చూస్తే విలువ వృక్షం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ చెట్టు ఆకులు, గింజలు ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. శరీరంలోని మలిన పదార్థాలను తొలగించడానికి లేదా విశాలను తొలగించడానికి సహాయపడుతుంది. విలువ ఆకులు శరీరాన్ని శుభ్రపరచడమే కాదు మానసిక శాంతిని కూడా ఇస్తుంది.
శివరాత్రికి ప్రత్యేకత : మహాశివరాత్రి రోజున ముఖ్యంగా మారేడు ఆకులు అనగా విలువ పత్రాలను శివునికి సమర్పించితే సంతోషిస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్రమైన రోజున శివునికి మారేడు ఆకులు భక్తిశ్రద్ధలతో సమర్పిస్తే భక్తులకు ఇష్టకార్యాలు నెరవేరుతాయి అని నమ్ముతారు. భక్తులకూ తమ కుటుంబంలో, ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి విముక్తిని పొందే ఎందుకో శివున్ని ఆరాధిస్తారు.
అయితే మారేడు ఆకులతో శివుడిని పూజలో అత్యంత ముఖ్యమైన సమర్పణలో ఒకటిగా మారాయి. మత్తులో మహాశివరాత్రి రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం, మారేడు ఆకులను సమర్పించడం టీవీ చేయడం వల్ల శివుని యొక్క అనుగ్రహం పొందుతారు. శివునికి మారేడు దళం అంటే చాలా ఇష్టం. ఒక్క మారేడు దళాన్ని శివునికి సమర్పిస్తే మీ కోరికలన్నీ సిద్ధిస్తాయి.
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
This website uses cookies.