Rajendra Prasad : తప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్.. ఇక నుండి మర్యాద ఇచ్చే మాట్లాడతా..!
Rajendra Prasad : రీసెంట్ గా స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి బర్త్ డే ఈవెంట్‌లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఈవెంట్‌లో ఆయన రోజా, మురళీ మోహన్, అలీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో, అలీ స్వయంగా స్పందిస్తూ పరిస్థితిని సున్నితంగా సమన్వయపరిచారు.
Rajendra Prasad : తప్పు తెలుసుకున్న రాజేంద్ర ప్రసాద్.. ఇక నుండి మర్యాద ఇచ్చే మాట్లాడతా..!
Rajendra Prasad : ఇక అలా మాట్లాడా..
తాజాగా రాజేంద్ర ప్రసాద్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. ఈ వివాదంపై మాట్లాడిన ఆయన “నా మాట తీరును అలీ సీరియస్‌గా తీసుకోలేదు. ఈ విషయాన్ని పెద్దది చేయవద్దని అతను కూడా చెప్పాడు. అయినా, ఎవరో కావాలని దీనిని పెద్దది చేస్తున్నారు. మేమంతా ఒకరికొకరం ప్రేమతో ఉన్నాం. అలాంటి అనుబంధాలు లేకుంటే ఇంత కాలం కలిసి ప్రయాణించలేము అని అన్నారు.
అలాగే, అలీ తనకు మళ్లీ ఫోన్ చేసి జరిగిందన్నీ మర్చిపో అని చెప్పినట్టు వెల్లడించారు. ఏదేమైనా జరిగినదానికి నేను చాలా హర్ట్ అయ్యాను అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఇకపై జీవితం అంతా ఎవరినైనా ‘మీరు’ అనే పిలుస్తాను. ఎప్పుడూ ‘నువ్వు’ అనే పదం వాడను. ఇది నేను ఎన్టీఆర్ గారి దగ్గర నేర్చుకున్న నేర్పు. నేను మాట ఇస్తున్నాను… ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు అందరినీ గౌరవంగా పిలుస్తాను” అని స్పష్టంగా చెప్పారు.
