
Rajinikanth comments on his life and happy successful life through kriya yoga book
Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బస్సు కండక్టర్ నుండి సూపర్ స్టార్‌గా మారిన రజనీకాంత్ తన కెరీర్‌లో ఎన్నో కోట్ల రూపాయలతో పాటు అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. ఇప్పటికీ కుర్రహీరోలతో పాటు సినిమాలు చేస్తున్నాడు. ఆయన అడిగితే ముందుకు ఏదైన వస్తుంది. కావాలనుకున్నది ఏదైన కళ్ల ముందు కొద్ది నిమిషాలలో ప్రత్యక్షం అవుతుంది. అయితే ఇలా ఉన్నా కూడా రజనీకాంత్ జీవితంలో సంతోషమే లేదంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
తాజాగా రజనీకాంత్ చెన్నైలోని `హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ థ్రూ క్రియ యోగా` అనే పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన జీవితంలో సంతృప్తి లేదన్నారు. తన జీవితంలో డబ్బు, పేరు ప్రఖ్యాతలు అన్నీ చూశానని, సంతోషం మాత్రం దక్కలేదన్నారు. సంతోషం, ప్రశాంతత కనీసం పది శాతం కూడా దక్కలేదని, ఎందుకంటే అవి శాశ్వతంగా మనతో ఉండేవి కావని పేర్కొన్నారు సూపర్ స్టార్.
Rajinikanth comments on his life and happy successful life through kriya yoga book
తాను గొప్ప నటుడిని అని చాలా మంది అంటుంటారని, వాళ్లు ప్రశంసిస్తున్నారో, విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను ఎన్నో సినిమాలు చేసినప్పటికీ `రాఘవేంద్ర`,`బాబా` చిత్రాలు మాత్రమే తనకు సంతృప్తినిచ్చాయని వెల్లడించారు. `బాబా` సినిమా చూశాక చాలా మంది హిమాలయాలకు వెళ్లినట్టు చెప్పారని, తన అభిమానులు కొందరు ఏకంగా సన్యాసులుగా మారిపోయారని, కానీ తాను మాత్రం ఇప్పటికీ నటుడిగానే కొనసాగుతున్నానని తెలిపారు రజనీ. ఆరోగ్యం గురించి చెబుతూ, హిమాలయాల్లో కొన్ని అపూర్వమైన మూలికలు దొరుకుతాయని, అవి తింటే వారానికి సరిపడా శక్తి లభిస్తుందన్నారు. ఆరోగ్యం అనేది మనిషికి చాలా ముఖ్యమైనదని చెప్పిన రజనీకాంత్, అనారోగ్యం పాలైతే మనకు కావాల్సిన వాళ్లు తట్టుకోలేరని వెల్లడించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఆగస్టు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నెల్సన్. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తమిళ్ లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే రజనీకాంత్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. పా.రంజిత్ దర్శకత్వంలో రజినీకాంత్ 170 వ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.
Rajinikanth comments on his life and happy successful life through kriya yoga book
గతంలో పా.రంజిత్ దర్శకత్వంలో కబాలి సినిమా చేశారు సూపర్ స్టార్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ సినిమాలో రజినీకాంత్ చాలా స్టైలిష్ గా కొత్తగా కనిపించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా రజినీకాంత్ కు అదిరిపోయే కథను వినిపించాడట రంజిత్.. కథ నచ్చడంతో సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మరో వైపు లోకేష్ కనగ రాజ్ కూడా రజినీ కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరి సినిమా ముందుగా వస్తుందో చూడాలి. `అపూర్వ రాగంగల్` చిత్రంతో నటుడిగా తెరంగేట్రం చేసిన రజనీకాంత్ `అంతులేని కథ`, `అవర్గల్`, `16వయథినిలే`, `బిల్లా`, మూండ్రు ముగమ్`, `ధర్మథిన్ తలైవన్`, `థళపతి`, `అన్నమలై`, `చంద్రముఖి`,`బాష`, `బాబా`, `నరసింహ`, `ముత్తు`, `శివాజీ`, `రోబో`, `2.0` వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలు చేశారు.
ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్‌తో `జైలర్` మూవీలో నటిస్తున్నారు రజనీ. కమల్‌హాసన్, రజనీకాంత్. అభిమానులు వారిని లివింగ్ లెజెండ్స్‌గా అభివర్ణిస్తారు. కెరీర్ ఆరంభంలో వీరిద్దరు కలిసి నటించిన చాలా చిత్రాలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. తాజా సమాచారం ప్రకారం ఈ అగ్ర నటులిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించనున్నారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
NIT Warangal Recruitment 2026 : వరంగల్‌లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
This website uses cookies.