Rajinikanth : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆతృత మరో లెవల్. ముఖ్యంగా తమిళనాడులో ఆయన అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కోలీవుడ్‌లో రజినీ సినిమా మొదలైందంటేనే పండుగ చేసుకునే డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. చెన్నై, తమిళనాడులో ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే స్కూళ్ళు, కాలేజీలు, పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు మూతపడాల్సిందే. కంపెనీ సీఈఓలే సెలవులు ప్రకటిస్తారు. అంత క్రేజ్ ఉంది తలైవర్‌కు. అయితే, గత కొన్నేళ్ళుగా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయినా రజినీ సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వస్తున్నారు.
గత చిత్రం అణ్ణాత్త ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ వారికి భారీ నష్టాలు తప్పలేదు. అయినా మళ్ళీ ఇప్పుడు రజినీతోనే వారు భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఇదే సంస్థలో నిర్మించిన గత చిత్రం బీస్ట్. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా మేకర్స్‌కు నష్టాలను మిగిల్చింది. అయినా మళ్ళీ రజినీ సినిమాకు అదే దర్శకుడిని ఎంచుకున్నారు. అతనే నెల్సన్ దిలీప్ కుమార్. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ దర్శకుడికి మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. తెలుగులోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అయితే, రజినీకాంత్, నెల్సన్ తో చేస్తున్న మూవీ టైటిల్ ని మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేశారు. మ్యూజిక్ సెన్షేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
ఇది రజినీ 169వ సినిమా. ఈ సినిమాకి జైలర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి, పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే, ఈ పోస్టర్ లో రజినీ కనపడకుండా రక్తంతో తడిచిన కత్తి ఉండడం ఆకట్టుకుంది. కానీ, తలైవర్ ఫ్యాన్స్ మాత్రం దర్శకుడుపై మండిపడుతున్నారు. రజినీ కనపడకుండా ఇదేం పోస్టర్ అని నెల్సన్‌ను కామెంట్స్ చేస్తున్నారు. ఇక రజినీ దర్బార్ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించగా, ఈ మూవీలో జైలర్ గా కనిపించనున్నారు. మరి చాలాకాలంగా హిట్ లేక కాస్త రేస్‌లో వెనకబడ్డ సూపర్ స్టార్‌కు అర్జెంటుగా భారీ అవసరం. ఇటీవలే కమల్ విక్రమ్ సినిమాతో వచ్చి ఊహించని సక్సెస్ అందుకున్నారు. దాంతో రజినీ ఫ్యాన్స్ కూడా అంతకు మించి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.