Rajinikanth : సూపర్ స్టార్ లేకుండా పోస్టర్ వదిలినందుకు దర్శకుడిని ఏకేస్తున్న ఫ్యాన్స్..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajinikanth : సూపర్ స్టార్ లేకుండా పోస్టర్ వదిలినందుకు దర్శకుడిని ఏకేస్తున్న ఫ్యాన్స్..?

 Authored By govind | The Telugu News | Updated on :20 June 2022,7:30 pm

Rajinikanth : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే ఆతృత మరో లెవల్. ముఖ్యంగా తమిళనాడులో ఆయన అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కోలీవుడ్‌లో రజినీ సినిమా మొదలైందంటేనే పండుగ చేసుకునే డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. చెన్నై, తమిళనాడులో ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే స్కూళ్ళు, కాలేజీలు, పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు మూతపడాల్సిందే. కంపెనీ సీఈఓలే సెలవులు ప్రకటిస్తారు. అంత క్రేజ్ ఉంది తలైవర్‌కు. అయితే, గత కొన్నేళ్ళుగా ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయినా రజినీ సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వస్తున్నారు.

గత చిత్రం అణ్ణాత్త ఫలితం ఏంటో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను నిర్మించిన సన్ పిక్చర్స్ వారికి భారీ నష్టాలు తప్పలేదు. అయినా మళ్ళీ ఇప్పుడు రజినీతోనే వారు భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఇదే సంస్థలో నిర్మించిన గత చిత్రం బీస్ట్. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా కూడా మేకర్స్‌కు నష్టాలను మిగిల్చింది. అయినా మళ్ళీ రజినీ సినిమాకు అదే దర్శకుడిని ఎంచుకున్నారు. అతనే నెల్సన్ దిలీప్ కుమార్. కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఈ దర్శకుడికి మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు. తెలుగులోనూ ఆయనకు మంచి క్రేజ్ ఉంది. అయితే, రజినీకాంత్, నెల్సన్ తో చేస్తున్న మూవీ టైటిల్ ని మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేశారు. మ్యూజిక్ సెన్షేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Rajinikanth Fans pressure to push hit

Rajinikanth Fans pressure to push hit

Rajinikanth : రేస్‌లో వెనకబడ్డ సూపర్ స్టార్‌కు అర్జెంటుగా భారీ అవసరం.

ఇది రజినీ 169వ సినిమా. ఈ సినిమాకి జైలర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి, పోస్టర్ ని రిలీజ్ చేశారు. అయితే, ఈ పోస్టర్ లో రజినీ కనపడకుండా రక్తంతో తడిచిన కత్తి ఉండడం ఆకట్టుకుంది. కానీ, తలైవర్ ఫ్యాన్స్ మాత్రం దర్శకుడుపై మండిపడుతున్నారు. రజినీ కనపడకుండా ఇదేం పోస్టర్ అని నెల్సన్‌ను కామెంట్స్ చేస్తున్నారు. ఇక రజినీ దర్బార్ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించగా, ఈ మూవీలో జైలర్ గా కనిపించనున్నారు. మరి చాలాకాలంగా హిట్ లేక కాస్త రేస్‌లో వెనకబడ్డ సూపర్ స్టార్‌కు అర్జెంటుగా భారీ అవసరం. ఇటీవలే కమల్ విక్రమ్ సినిమాతో వచ్చి ఊహించని సక్సెస్ అందుకున్నారు. దాంతో రజినీ ఫ్యాన్స్ కూడా అంతకు మించి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఒత్తిడి చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది