Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లో మన్మధుడు.. ఎవరైనా సరే అతనికి పడిపోవాల్సిందే..!
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో నవ మన్మథుడు ఉన్నాడు. అతనెవరో ఇప్పటికే అందరికి తెలిసిందే. ఆర్జే సూర్య.. హౌస్ లో అతనికి ఎవరైనా పడిపోవాల్సిందే. మొన్నటిదాకా ఆరోహితో చాలా క్లోజ్ ఉన్న సూర్య ఆమె బయటకు వెళ్లడంతో చిన్నగా ఇనయాకి క్లోజ్ అయ్యాడు. మొదట్లో హౌస్ లో అందరి మీద ఫైర్ అవుతూ వచ్చిన ఇనయా దాని వల్ల ఆమె ఆటకి ఎఫెక్ట్ అవుతుందని గమనించి ఆమె తన ఆట మార్చేసింది. హౌస్ లో అందరితో క్లోజ్ గా ఉంటూ వస్తున్న ఇనయా ఇప్పుడు సూర్యకి కనెక్ట్ అయ్యింది.
మొన్నీమధ్యనే బిగ్ బాస్ కన్ ఫెషన్ రూం లో కూడా సూర్య అంటే క్రష్ అని చెప్పి షాక్ ఇచ్చింది. ఆదివారం ఎపిసోడ్ లో ఇనయా, చంటి చివరిగా ఉన్నారు. వారిలో ఇనయా వెళ్తుందని బోరున ఏడ్చేశాడు సూర్య. ఇనయా కూడా సూర్యకి టైట్ హగ్ ఇచ్చింది. ఫైనల్ గా హౌస్ లో మరో లవ్ స్టోరీ మొదలైంది. మరి హౌస్ లో అంతమంది ఉండగా అందరు సూర్యకి కనెక్ట్ అవడం ఏంటని అనుకుంటున్నారు. మరి సూర్య, ఇనయ లవ్ స్టోరీ ఎన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి. సూర్య ఆటలో తన మార్క్ చూపిస్తున్నా సరే ఇంకా ఎందుకో వెనకపడి ఉన్నాడు. అయితే సూర్య ఆట మీద కన్నా ఇలాంటి లవ్ స్టోరీల మీద ఎక్కువ ఫోకస్ పెట్టాడు.

Bigg Boss 6 Telugu manmadhudu in bigg boss house
సూర్య, ఇనయాల లవ్ స్టోరీ కూడా షో కి మరింత బజ్ తెచ్చేలా ఉంది. బిగ్ బాస్ సీజన్ 6 లో టాప్ 5 లో ఉండే ఛాన్స్ అతనికి ఉన్నా ఇంకా తన ఆట తీరుని మెరుగు పరచుకోవాల్సిందే అని అంటున్నారు. ఇనయా విత్ సూర్య లవ్ స్టోరీ షోకి మరింత హైప్ తెచ్చేలా ఉందని చెప్పొచ్చు. మరి వీరి లవ్ స్టోరీ షోలో మాత్రమేనా లేక బయట కూడా కొనసాగుతుందా అన్నది చూడాలి. సూర్య మాత్రం హౌస్ లో ఉన్న అందరిని ఎట్రాక్ట్ చేస్తూ సత్తా చాటుతున్నాడు. అయితే ఆటలో మాత్రం ఇంకా తనని తాను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ రేసులో సూర్య నిలుస్తాడా లేదా అన్నది చూడాలి.