YS Jagan : ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఎన్నికల గురించే చర్చ. సాధారణంగా ఎక్కడైనా ఎన్నికలు జరిగితే అంతగా ఎవ్వరూ టెన్షన్ పడరు కానీ.. అసలు మునుగోడు ఉపఎన్నికలో జరుగుతున్న చిత్రాలు చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. అక్కడ ఎమ్మెల్యేల బేరసారాలు నడి రోడ్డు మీద జరుగుతున్నాయి. అది కూడా వందల కోట్లకు. ఓవైపు ఓటర్లను, మరోవైపు ప్రజాప్రతినిధులను కూడా పార్టీలు ఊరిస్తున్నాయి. తమ దారిలోకి తెచ్చుకుంటున్నాయి. అందుకే కుప్పలు కుప్పలుగా డబ్బులు కురిపిస్తున్నాయి.
తాజాగా పలువురు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల ఘటనకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరెత్తడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నపార్టీ బీజేపీ ఏకంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని బేరసారాలు జరుపుతోందని వార్తలు వస్తుంటే.. పార్టీల అధినేతలుగా వారు స్పందించాల్సిన అవసరం ఉంది. కానీ.. పవన్, చంద్రబాబు అసలు ఆ విషయం గురించే మాట్లాడటం లేదు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్న నందకుమార్, సింహయాజులు, ఇంకో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వాళ్లను విచారిస్తున్నారు. అసలు నిజంగానే ఎమ్మెల్యేల కొనుగోలు అంశం ఇంత సీరియస్ అయిందా అంటే చెప్పడం కష్టం కానీ.. అసలు ఏ విషయం మీదనైనా మాట్లాడే ఈ ఇద్దరు నేతలు.. ఈ విషయం మీద మాత్రం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు. అసలే తెలంగాణ ఇష్యూ. మనకెందుకు.. మన పార్టీలు పెద్దగా అక్కడ యాక్టివ్ గా లేవు అనే ఆలోచనా.. లేక మునుగోడు ఎన్నికల్లో తమ పార్టీల అభ్యర్థులు పోటీ చేయడం లేదనా అనేది తెలియదు కానీ.. ఒకవేళ ఇటువంటి వ్యవహారం ఏపీలో జరిగితే వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేసేవాళ్లు కావచ్చు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.