Rakul Preet Singh : పింక్ టాప్ లో పిచ్చెక్కిస్తున్న రకూల్ ప్రీత్ సింగ్.. వీడియో
Rakul Preet Singh : వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రకూల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతితక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయింది. తెలుగులో గోపిచంద్ తో లౌక్యం, నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం.. అల్లు అర్జున్ తో సరైనోడు…రామ్ చరణ్ తో బ్రూస్ లీ, ధ్రువ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో జయజానకీ నాయక, వైష్ణవ్ తేజ్ తో కొండపొలం వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
సౌత్ లో ఇతర భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది.కాగా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అక్కడ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటోంది. ఛత్రీవాలీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో రన్ వే-34, అజయ్ దేవగణ్ తో థ్యాంక్ గాడ్, ఆయుష్మాన్ ఖురానాతో డాక్టర్ జీ, అటాక్ సినిమాలతో పాటు మరో సినిమాలో కూడా రకుల్ నటించింది.
కాగా రకుల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. లేటెస్ట్ ఫొటో షూట్స్, జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ ఫొటోలతో, వీడియోలతో పిచ్చెక్కిస్తోంది. కాగా ప్రస్తుతం రకూల్, ప్రగ్నా జైశ్వాల్ ఓ రెస్టారెంట్ లో ఉన్న ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. రకుల్ పింక్ టాప్ లో ఎద అందాలతో మతి పోగొడతోంది. దీంతో నెట్టింట్లో వైరల్ అవుతోంది. రకుల్ అందాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మీరు కూడా చూసేయండి ఇక..