Rakul Preet Singh : అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారంటూ రకుల్ ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ప్రధానాంశాలు:
Rakul Preet Singh : అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారంటూ రకుల్ కీలక వ్యాఖ్యలు
Rakul Preet Singh : ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ వన్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. స్టార్ హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన రకుల్, కొన్నేళ్లుగా కెరీర్ పరంగా వెనుకబడ్డారు. బాలీవుడ్, కోలీవుడ్ లాంటి ఇతర ఇండస్ట్రీలలో ప్రయత్నాలు చేసినా సరైన సక్సెస్ దక్కకపోవడంతో ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. పెళ్లి తరువాత మరింతగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్న రకుల్, తాజాగా అబార్షన్ గురించి చేసిన వ్యాఖ్యలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.

Rakul Preet Singh : అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నారంటూ రకుల్ ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు
Rakul Preet Singh : అబార్షన్ పై రకుల్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రకుల్.. అబార్షన్ అనేది శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా తీవ్రంగా బాధించే అంశమని పేర్కొన్నారు. ‘‘స్క్రీన్ పొర తీస్తూనే ఎంతో నొప్పి ఉంటుంది. మరి మన శరీరంలో ఉన్న జీవాన్ని తొలగిస్తే ఇంకెంత బాధ కలిగిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు’’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చాలామంది అనుకోకుండా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు సులభంగా అబార్షన్ చేయించమని చెప్పేస్తారని, కానీ ఆ నిర్ణయం వెనుక దాగిన బాధను ఎవ్వరూ అర్థం చేసుకోరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలతో రకుల్ ప్రీత్ సింగ్ ఎంతో మంది మహిళల భావాలను స్పష్టంగా ప్రపంచానికి తెలియజేశారు. ఐదుగురిలో ఇద్దరు మహిళలు మూడు నుంచి ఐదు అబార్షన్లను ఎదుర్కొంటున్నారని చెప్పిన ఆమె, భర్తలు తమ భార్యల బాధను అర్థం చేసుకుని మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. అబార్షన్‌పై బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఉందని రకుల్ స్పష్టంగా తెలియజేయడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.