Ram Charan : కొంత‌కాలం వేచి చూడ‌క త‌ప్ప‌దు ఉపాస‌న‌… వైర‌ల్ అవుతున్న రామ్ చ‌ర‌ణ్ పోస్ట్‌

Authored By Sam C | The Telugu News | Published on: May 7, 2022, 6:00 pm

Ram Charan: మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చర‌ణ్ ఇటీవ‌ల ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన తెలిసిందే. ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్‌కి పాన్ ఇండియా క్రేజ్ ద‌క్కింది. ఇక ఈ సినిమా త‌ర్వాత ఆచార్య అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిత్రం పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ప్ర‌స్తుతం శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు రామ్ చ‌ర‌ణ్ .త‌న 15వ చిత్రం ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. దాదాపు ఓ వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉండనుంది.

వైజాగ్ షెడ్యూల్ ముగిసిన వెంటనే చరణ్ కొంత గ్యాప్ తీసుకోనున్నట్లు సమాచారం. అయితే చరణ్ వైజాగ్ షూట్ లో ఉండగానే భార్య ఉపాసన ఓ కోరిక బయటపెట్టారు.మండుటెండల్లో ఉపాసన కు ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి చెక్కేయాలని ఉందట. ఇంస్టాగ్రామ్ లో తన మూడ్ ఉపాసన తెలియజేశారు. ఉపాసనను ఎంతగానో ప్రేమించే చరణ్ కోరికకు స్పందించారు. హాలిడేకి వెళ్లాలని నాకు కూడా ఉంది. కానీ ఏం చేయను కొన్ని రోజులు వేచి చూడక తప్పదు… అంటూ ఉపాసనను ట్యాగ్ చేశారు. ఆర్సి 15 మూవీ షూటింగ్ మధ్యలో ఉన్న నేను వెకేషన్ కి వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికి ఎదురుచూడక తప్పదని ఆమెకు తెలియజేశారు .

ram charan advice to upasana

ram charan advice to upasana

Ram Charan : చ‌ర‌ణ్ స‌లహా..

గ్యాప్ దొర‌కిన‌ప్ప‌డ‌ల్లా తరచుగా చరణ్, ఉపాసన టూర్స్ కి వెళుతూ ఉంటారు. అప్పట్లో ఆఫ్రికా అడ్వెంచరస్ టూర్ కి వెళ్లారు ఈ జంట. అక్కడ క్రూరమైన మృగాల మధ్య సఫారీ చేశారు. పనిలో పనిగా ఆఫ్రికాలోని వైల్డ్ లైఫ్ ని తమ కెమెరాలో బంధించారు. వారి ఫొటోగ్రఫీ కి సంబంధించిన గ్యాలెరీ ఇంట్లో ఏర్పాటు చేసి, తమ ఫ్రెండ్స్ ముందు ప్రదర్శించారు. ఇక ప్ర‌స్తుతం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమాలో న‌టిస్తుండ‌గా, ఇందులో కియారా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ మూవీలో రామ్ చరణ్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించనున్నారు

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp