Ram Charan : రామ్ చరణ్‌, శంకర్‌ సినిమా ఆ పుకార్లలో నిజం లేదు భయ్యా..!

Authored By aruna | The Telugu News | Published on: August 21, 2022, 1:00 pm

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు శంకర్ కాంబినేషన్లో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ మాకు అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ శంకర్ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది, కానీ ఇండియన్ 2 సినిమా షూటింగ్ కి సంబంధించిన బ్యాలెన్స్ వర్క్ ని పూర్తి చేయడానికి చెన్నైకి శంకర్ చేరుకున్నాడని, దాదాపు రెండున్నర నెలల పాటు అక్కడే శంకర్ ఆ సినిమా పనులతో బిజీగా ఉండబోతున్నాడని సమాచారం అందుతుంది. అందుకే ప్రస్తుతానికి రామ్ చరణ్ సినిమాను ఆయన పక్కన పెట్టాడని వార్తలు వస్తున్నాయి.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అవడానికి మరో రెండు నెలల సమయం పడుతుందని.. ఆ రెండు నెలల సమయానికి గాను దర్శకుడు శంకర్ నవంబర్ మరియు డిసెంబర్ నెలలను కేటాయించాడని అంటున్నారు. సినిమాను అన్ని అనుకున్నట్లుగానే జనవరిలో విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ మరియు శంకర్ సినిమాకు సంబంధించిన షూటింగ్ నిలిపివేశారు. మళ్లీ నవంబర్లో పున ప్రారంభించే అవకాశం ఉందని క్లారిటీగా సమాచారం అందుతుంది. అంతే తప్ప ఈ సినిమా షూటింగు ఆగిపోలేదు. అలాగని సినిమా షూటింగ్ పూర్తి అవ్వలేదు.

Ram Charan and shankar movie rumours and clarity

Ram Charan and shankar movie rumours and clarity

మీడియాలో వస్తున్న పుకార్లని మెగా ఫ్యాన్స్ నమ్మకుండా అసలు విషయాన్ని తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటాడు. కనుక రామ్ చరణ్ తో సినిమాని మల్లి ప్రారంభించేందుకు సమయం పడుతుంది. ఆలోపు రామ్ చరణ్ తన తదుపరి సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను చూసుకుంటే బెటర్ అని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ మరియు శంకర్ల కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో కాకుండా తమిళంలో కూడా రూపొందుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో భారీ ఎత్తున వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp