Ram Charan : రామ్ చరణ్‌, శంకర్ మూవీకి బ్రేక్‌.. ఆ టైమ్ కి విడుదల అయ్యేనా?

Authored By aruna | The Telugu News | Published on: August 18, 2022, 10:00 pm

Ram Charan : రామ్ చరణ్ మరియు శంకర్ ల కాంబినేషన్‌ లో రూపొందుతున్న సినిమా షూటింగ్ బ్యాక్ టుబ్యాక్‌ షెడ్యూల్స్ ను ముగించుకుంది. సినిమా చిత్రీకరణ మొదట అనుకున్న ప్రకారం ఆగస్టు లేదా సెప్టెంబర్ లో పూర్తి చేయాలని భావించారు. కాని అనూహ్యంగా సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి ఇది కాస్త నిరుత్సాహంను.. నిరాశను కలిగించే వార్త అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌ సీ 15 సినిమా షూటింగ్ కు రెండు నుండి మూడు నెలల గ్యాప్ ఇవ్వబోతున్నారట. కారణం ఏంటీ అంటే ఇండియన్ 2 సినిమా చిత్రీకరన కోసం శంకర్ గ్యాప్‌ తీసుకున్నాడట. శంకర్ గతంలో ఇండియన్ 2 ను మధ్య లో వదిలేశాడు. లైకా ప్రొడక్షన్స్ వారితో ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ ఆ సినిమాను చేసేందుకు గాను ఓకే చెప్పాడు. త్వరలోనే సినిమా ను పట్టాలెక్కించి షూటింగ్ ను ముగించాలని శంకర్ కి కమల్ హాసన్ సూచించాడు. అందుకే ఆర్ సీ 15 ని పక్కన పెట్టడం జరిగిందని మాకు సమాచారం అందుతోంది.

ram charan and shankar movie shooting late and release date late

ram charan and shankar movie shooting late and release date late

రామ్ చరణ్‌ మరియు శంకర్ ల కాంబో లో రూపొందుతున్న సినిమా ను సంక్రాంతికి విడుదల చేస్తానంటూ దిల్ రాజు గతం లో ప్రకటించాడు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం శంకర్ మూవీ షూటింగ్ ఇప్పట్లో మొదలు అయ్యేది లేదు కనుక విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే రామ్‌ చరణ్‌ మరియు శంకర్ కాంబో సినిమా రావడానికి వచ్చే ఏడాది సమ్మర్ అయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది లోనే గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా తో చరణ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp