Ram Charan – Upasana : భార్య ఉపాసన తో కలిసి బిగ్ న్యూస్ చెప్పిన రామ్ చరణ్ – మెగా ఫ్యాన్స్ కి పూనకాలే !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: January 14, 2023, 6:00 pm

Ram Charan – Upasana : టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు చెబుతున్నారు. ఇటీవల తను తండ్రి కాబోతున్నట్లు చెప్పిన రాంచరణ్ రీసెంట్గా అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పాడు. మనకు తెలిసిందే రామ్ చరణ్ ఉపాసనల పెళ్లి అయి పది సంవత్సరాలు అయినా సంతానం అందకపోవడంతో అభిమానులు మెగా ఫ్యామిలీకి వారసుడు రాడేమో అని భయపడ్డారు. కానీ ఇటీవలే ఉపాసన ప్రెగ్నెంట్ అని త్వరలోనే మెగా ఫ్యామిలీకి వారసుడు రాబోతున్నాడని చిరంజీవి అఫీషియల్ గా ప్రకటించారు.

ఉపాసన ప్రెగ్నెంట్ అని గుడ్ న్యూస్ చెప్పడంతో మెగా అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఇదిలా ఉండగా రామ్ చరణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ ప్రస్తుతం ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తానే స్వయంగా చెప్పాడు. దీంతో ఈ న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇటీవల గ్లోబల్ అవార్డ్స్ కోసం అమెరికా వెళ్ళిన రాంచరణ్ అక్కడ మీడియాకు తను నెక్స్ట్ చేయబోయే సినిమాల గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వివరించాడు.

Ram Charan and Upasana say good news

Ram Charan and Upasana say good news

2023లో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు, 2024లో మరో మూడు సినిమాలకు ఓకే చేసినట్లు చెప్పుకొచ్చాడు. మొత్తం మీద ఆరు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అని తెలుస్తుంది. దీంతో మెగా పవర్ స్టార్ అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. అంతేకాదు 2023 రామ్ చరణ్ తనకు పుట్టబోయే బిడ్డ ఈ సంవత్సరంలోనూ పుట్టబోతున్నాడు. దీంతో మెగా అభిమానులు రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు చెప్పడంతో ఖుషి అవుతున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp