Ram Charan : రామ్ చరణ్.. ఉపాసనలా కూతురికి బంగారు పాదముద్రలు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ram Charan : రామ్ చరణ్.. ఉపాసనలా కూతురికి బంగారు పాదముద్రలు వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :1 August 2023,8:00 pm

Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వ్యక్తిగత జీవితం ప్రొఫెషనల్ లైఫ్ మంచి రేంజ్ లో దూసుకుపోతుంది. “RRR” సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన చరణ్ 11 సంవత్సరాల తర్వాత ఇటీవల కూతురు పుట్టడంతో ఫుల్ ఆనందంగా ఉన్నారు. జీవితం అన్ని రకాలుగా పాజిటివ్ వైబ్రేషన్స్ తీసుకొస్తూ ఉంది. ఇదిలా ఉంటే జూన్ 20న కూతురు కింకారా పుట్టగా పది రోజుల తర్వాత ఉయ్యాల ఫంక్షన్ మెగా మరియు ఉపాసన ఫ్యామిలీ చాలా గ్రాండ్ గా నిర్వహించారు. అయితే కూతురు పుట్టిన నేపథ్యంలో ఫస్ట్ టైం ఉపాసన తన పుట్టింటికి వెళ్ళిన క్రమంలో.. మొదటిసారి తల్లి ఇంటికి వచ్చిన మనవరాలికి.

ఉపాసన తల్లి శోభన కామినేని.. భారీ ఎత్తున స్వాగతం పలికారట. ఈ క్రమంలో దిష్టి తీసిన వ్యక్తికి దాదాపు లక్ష రూపాయలు ఇచ్చినట్లు సమాచారం. ఇదే సమయంలో మనవరాలి బంగారు పాదముద్రలు కూడా తీసుకోవడం జరిగిందట దానిని ఒక ఫ్రేమ్ గా ఆమె డెకరేషన్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కూతురు పుట్టిన ఘడియాలోనే అపోలో ఆసుపత్రిలో ఆరోజు పండగ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిరంజీవి చాలా భావోద్వేగానికి గురయ్యారు.

ram charan upasana daughter has golden footprints video goes viral

ram charan upasana daughter has golden footprints video goes viral

కాగా మనవరాలు పుట్టించిన నెల రోజుల తర్వాత ఇటీవల ఫస్ట్ టైం ఇంటికి రావడంతో శోభన కామినేని అద్భుతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. వాస్తవానికి చరణ్ కూతురికి పెట్టిన పేరుని ఉపాసనాకి పెట్టాలని అప్పట్లో భావించారట. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అదే పేరు తన కూతురికి ఉపాసన పెట్టడంతో శోభన కామినేని చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది