
another leak from rc 15 Movie
Ram Charan : ఆది పినిశెట్టి.. ఈ నటుడు తెలుగు ప్రేక్షకులకి చాలా సుపరచితం. కోలీవుడ్‌లో మంచి హవా నడుస్తున్న సమయంలోనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. రామ్ చరణ్ నటించిన రంగస్థలంలో కుమార్ బాబు అనే పాత్రలో అద్భుతమైన నటనను కనబరిచిన ఆది.. ఆ తర్వాత ‘నీవెవరో’, ‘యూటర్న్’ చిత్రాల్లో నటించారు. టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది పినిశెట్టి.. నిక్కీ గల్రానీతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. తెలుగులో నిక్కీ గల్రాని.. సునీల్ సరసన కృష్ణాష్టమి, ఆది పినిశెట్టి సరసన మలుపు చిత్రాల్లో నటించింది. టాలీవుడ్ లో నిక్కీ గల్రాని పెద్దగా పాపులర్ కాలేదు. నిక్కీ గల్రాని ఇండస్ట్రీలోకి సంజన గల్రాని సోదరిగా ఎంట్రీ ఇచ్చింది.
మలుపు చిత్రంతో ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని మధ్య పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. ప్రస్తుతం వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అంటున్నారు. ఆది పినిశెట్టి సన్నిహితులు ఈ విషయాన్ని మీడియాకు వివరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆది, నిక్కీ గల్రాని ఇద్దరూ తమ రిలేషన్ జీవితాంతం కొనసాగించబోతున్నారు అని.. దీని కోసం వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ కి ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా నిక్కీ గల్రాని.. ఆది పినిశెట్టి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా హాజరవుతోందట.
ram charan brother marriage in soon
నిక్కీ గల్రాని ప్రస్తుతం తమిళం, మలయాళంలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. వివాహం తర్వాత ఆమె నటన కొనసాగిస్తుందా లేదా అనేది క్లారిటీ లేదు. వీరి ప్రేమ, పెళ్లి వివాహంపై ఎప్పుడు క్లారిటీ వస్తుందా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆది ..రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక నిక్కీ గల్రాని విషయానికి వస్తే ప్రస్తుతం తమిళం, మలయాళంలో కొన్ని సినిమాల్లో నటిస్తోంది.ఆది విషయానికి వస్తే..ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆది పినిశెట్టి ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కోలీవుడ్‌లో కమర్షియల్ హీరోగా రాణిస్తూనే తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటుతున్నారు.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.